Perni Nani: పేర్ని నాని వెర్సస్ బాలశౌరి, మచలీపట్నం అధికార పార్టీలో విభేదాలు
Political differences in Machalipatnam between Perni Nani and MP Bala Shouri
ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అధికార పార్టీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. మచలీపట్నంలో నాయకుల మధ్య అభిప్రాయబేధాలు మరోసారి బయటపడ్డాయి. ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే పేర్ని నానిల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. అధికారిక కార్యక్రమానికి పేర్ని నాని డుమ్మాకొట్టడంతో ఈ విషయం స్పష్టమయింది.
మచిలీపట్నంలో జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో కొత్తగా స్పందన సమావేశ మందిరం ఏర్పాటు జరిగింది. ఎంపీ బాలశౌరి ప్రారంభోత్సవం చేశారు. ఎంపీ లాడ్స్ నుంచి సమావేశ మందిరానికి 15 లక్షల రూపాయలు మంజూరు చేశారు. స్థానిక ఎమ్మెల్యే పేర్నినాని ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.
పోలీసుల నుంచి వచ్చిన ఆహ్వాన పత్రికలో పేర్ని నానికి ప్రాధాన్యత దక్కకపోవడంతో కార్యక్రమానికి హాజరు కాలేదని ప్రచారం జరుగుతోంది. ప్రత్యేక అతిధుల జాబితాలో నగర నగర మేయర్, ఏడుగురు జిల్లా శాసనమండలి సభ్యుల తర్వాత పేర్ని నాని పేరు ఉండడం పట్ల నాని అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడికి అవమానం జరిగిందని భావిస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారమే ఆహ్వాన పత్రికలో పేర్లు వేశామని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
బాలశౌరి కార్యక్రమానికి హాజరు కాని నాని కలెక్టరేట్ లో ధాన్యం కొనుగోలు ఇబ్బందుల పై జేసీతో చర్చించారు. అదే విధంగా పౌరసరాల శాఖ అధికారితో సమావేశం అయ్యారు.