Police constable written exam: ఈనెల 22న పోలీస్ కానిస్టేబుల్ రాతపరీక్ష
Police constable written exam:ఏపీలో ఎస్‌ఐ, ఉద్యోగాల భర్తీకి సంబంధించిన దరఖాస్తు గడువు జనవరి 18న ముగిసింది. వచ్చాయి. వీరిలో పురుషులు 1,40,453 మంది ఉండగా..మహిళలు 32,594 మంది ఉన్నారు. మొత్తం 411 ఎస్‌ఐ పోస్టులకు 1,73,047 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మరో వైపు కానిస్టేబుల్ పరీక్ష హాల్‌టికెట్లను ఇప్పటికే పోలీసు నియామక మండలి విడుదల చేసింది. జనవరి 22న ప్రిలిమినరీ రాతపరీక్ష నిర్వహించనున్నారు.
కానిస్టేబుల్ పరీక్షలో పేపర్-1, పేపర్-2 ఉంటాయి. మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.పేపర్-1లో 100 ప్రశ్నలు-100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలు-100 మార్కులు. పరీక్ష సమయం 3 గంటలు. ఓఎంఆర్ విధానంలోనే రాతపరీక్ష ఉంటుందని అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షను నిర్వహిస్తారు. అభ్యర్థులను గంట ముందే పరీక్షహాలులోకి అనుమతిస్తారు. ఒక్క నిమిషం ఆలస్యం అయిన పరీక్షహాలులోకి అనుమతించరు. ఒక్క హాల్ టికెట్ తప్ప ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను ఎట్టిపరిస్థితిలలోను అనుమతించరు. అలాగే పరీక్షరాసే అభ్యర్థి నలుపులేదా బ్లూ పెన్ మాత్రమే వాడాలన్నారు. ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులలో ఎదో ఒకటి అభ్యర్థి తమవెంట తీసుకురావాలని సూచించారు. మొత్తం 6,100 పోస్టులకు 5,03,486మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.