ఏపీ మంత్రి ఇంటిని తగలబెట్టిన ఆందోళనకారులు?
ఆంధ్ర ప్రదేశ్ లోని అమలాపురంలో కోనసీమ జిల్లా పేరు మార్చొద్దంటూ కొనసీమ సాధన సమితి చేపట్టిన ఆందోళన అదుపు తప్పింది. కోనసీమ జిల్లా పేరు మార్పు ప్రకటనపై అమలాపురంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ మధ్య కాలంలో కోనసీమ జిల్లాను, అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అభ్యంతరాలు ఉంటే 30 రోజుల లోపు తెలపాలని, వినతులు స్వీకరిస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే కోనసీమ జిల్లా పేరునే కొనసాగించాలంటూ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు.
పోటా పోటీగా అంబేద్కర్ జిల్లా, అనుకూల వ్యతిరేక వర్గాలు నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు విసిరిన క్రమంలో డీఎస్పీ మాధవరెడ్డి, ఎస్పీ గన్ మ్యాన్ లకు అయ్యాయి. ఈ క్రమంలో అక్కడ పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చింది. ఆందోళనకారులు ఆవేశంతో మంత్రి విశ్వరూప్ ఇంటి పైకి దూసుకెళ్లారు. కామనగరువులోని మంత్రి విశ్వరూప్ క్యాంపు కార్యాలయంపై కూడా దాడులు చేశారు ఆందోళనకారులు. మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు పెట్టారు. అలాగే ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అలాగే విశ్వరూప్ ఇంటి సమీపంలో 3 ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. మంత్రి ఇంట్లో ఉన్న మూడు కార్లను ధ్వంసం చేశారు. ఆందోళనకారులను అదుపు చేయడానికి ప్రయత్నించిన పోలీసులపై రాళ్లతో దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది.