Perni Nani: పవన్ కళ్యాణ్ నాలుకకు నరం ఉండదు – పేర్ని నాని
Perni Nani attacks Jana Sena Chief Pawan Kalyan
ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని జనసేనానిపై విమర్శల వర్షం కురిపించారు. కాపు నేతలు ఏర్పాటు చేసిన సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ నాని అనేక విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ నాలుకకు నరం ఉండదని అన్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడుతాడో అతనికే తెలియదని నాని విమర్శించారు. కాపులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ లు కలిస్తే ఈ ప్రభుత్వం మారిపోతుందని పవన్ చేసిన వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు.
ప్రభుత్వం ఎందుకు మారాలి? ఎవరి చేతుల్లోకి అధికారం వెళ్ళటానికి మారాలని నాని ప్రశ్నించారు. తన లబ్ది కోసం, ఆనందం, తృప్తి కోసం ప్రజలు ఏమైపోయినా పవన్ కళ్యాణ్ కు పర్వాలేదని నాని విమర్శించారు. పవన్ కళ్యాణ్ నోరు విప్పితే అబద్ధాలని నాని విమర్శించారు. పవన్ నాన్న కాపు, అమ్మ బలిజ అని కొత్తగా చెబుతున్నాడని, రాజకీయం కోసం ఎంతకైనా తెగిస్తాడని నాని విమర్శించారు. ప్రజాసేవ చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే నీకు కులంతో ఏం పని అని నాని ప్రశ్నించారు. ప్రజా నాయకులకు కులంతో పని ఉండదని నాని తేల్చి చెప్పారు.
2024 మార్చి కల్లా పవన్ కళ్యాణ్, చంద్రబాబు ముసుగు బయటపెట్టక తప్పదని నాని అన్నారు. ప్రతి కాపు నాకు ఓటు వేసి ఉంటే నేను ఓడిపోయే వాడిని కాదని పవన్ కళ్యాణ్ అనటం అతని దౌర్భాగ్యం అని నాని అన్నారు. ఒక కులం ఓట్లతో గెలిచే వారు కుల నాయకుడు అవుతాడు, ప్రజా నాయకుడు కాదని.. కమ్మవారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు కాపుల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నాడని నాని విమర్శలు గుప్పించారు.
పవన్ కళ్యాణ్ ను జాతి క్షమించదు – అంబటి
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ఎప్పటికప్పుడు కౌంటర్ ఇచ్చే మంత్రి అంబటి ఈసారి ట్విట్టర్ వేదికగా స్పందించారు. కాపులందరినీ కట్టగట్టి చంద్రబాబుకి తాకట్టుపెట్టడమే సోషల్ ఇంజనీరింగ్ అనుకుంటున్న పవన్ ని జాతి క్షమించదు అని ట్వీట్ చేశారు.
కాపులందరినీ కట్టగట్టి
చంద్రబాబుకి తాకట్టుపెట్టడమే
సోషల్ ఇంజనీరింగ్ అనుకుంటున్న
పవన్ ని జాతి క్షమించదు !— Ambati Rambabu (@AmbatiRambabu) March 13, 2023