ఏపీ ప్రభుత్వంపై రోజుకో ట్వీట్ తో పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నారు
Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వైసీపీ ప్రభుత్వంపై వరుసగా ట్వీట్ల (Twit)తో చెలరేగిపోతున్నారు. పాపం పసివాడు అంటూ మొన్న జగన్ను విమర్శిస్తూ ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్ లేటెస్ట్గా 2021 వరదలకు కొట్టుకుపోయిన అన్నమయ్య డ్యామ్ సమస్యలను తెరపైకి తీసుకొచ్చారు. అయినవాళ్లకు అన్నమయ్య ప్రాజెక్టు పునర్ నిర్మాణం అప్పగించినా ఇంతవరకూ పనులు పూర్తి కాలేదని విమర్శిస్తూ వరుస ట్వీట్లు పెట్టారు. 2021 నవంబర్ 19న అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందని… ఈ దుర్ఘటనలో 23 మంది చనిపోయారను 22 వేల ఎకరాల్లో పంట మునిగిందని గుర్తు చేశారు ప అప్పట్లో ఘటనపై రియాక్ట్ అయిన ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చిందని గుర్తు చేస్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో పెట్టారు. బాధితులకు మూడు నుంచి ఆరు నెలల్లో ఇళ్లు కట్టిస్తామని..అన్నమయ్య డ్యామ్ పునర్నిర్మిస్తామని చెప్పినట్టు ఆ వీడియోలో పవన్ వివరించారు. ప్రమాద ఘటన జరిగిన నేటి 18 నెలలు గడుస్తున్నా బాధితులకు ఎదురు చూపులు.. రైతులకు ఎండమావులే అంటూ స్టేట్మెంట్తో కూడిన వీడియో వదిలారు. మాటలు మిన్న.. ఫలితాలు సున్నా అంటూ జగన్ ప్రభుత్వాన్ని ఏకిపారేశారు.
కమిటీ ఏమైంది?
అసెంబ్లీలో ఏపీ సీఎం అన్నమయ్య డ్యామ్ ప్రమాదంపై మాట్లాడుతూ చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన హై లెవెల్ కమిటీ వేస్తున్నాము ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఘనంగా ప్రకటించారన్నారు. మరి ఆ కమిటీ ఏమైందో వారు రాష్ట్రంలోని మిగతా డ్యాములకు ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఏ సూచనలు చెప్పారో , AP CM ఏ చర్యలు తీసుకున్నారు ఆ దేవుడికే తెలియాలంటూ తీవ్ర విమర్శలు చేశారు. అన్నమయ్య డామ్ ప్రమాదంపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చెప్పింది గుర్తు చేసిన పవన్ ఇప్పటి వరకూ కనీసం కొంచెం కూడా పనులు చేయలేదని విమర్శించారు. ఈ 18 నెలలలో సాధించింది ఏమిటయ్యా అంటే అస్మదీయుడు పొంగులేటికి 3.94 శాతం అదనపు ప్రయోజనంతో రివర్స్ టెండరింగ్ డ్రామా నడిపి పనిని 660 కోట్లకు అప్పచెప్పారని సెటైర్లు వేశారు.
A gentle reminder to officially 500 Cr worth AP CM (Richest amongst all CMs) who constantly talks about
‘Class War’ like Karl Marx.The funny part is the ‘oppressor speaks like oppressed’.Any doubts, please check with AP Human Right Groups.• 19.11.2021 తేదీన తెల్లవారుజామున… pic.twitter.com/CwoNZqspjm
— Pawan Kalyan (@PawanKalyan) May 19, 2023