Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఒక కామెడీ పీస్- మంత్రి అంబటి
Pawan Klyan is a comedy Piece, says AP Minister Ambati Rambabu
జనసేన నాయకులు చేస్తున్న వరుస కామెంట్లకు ఏపీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. నన్ను టార్గెట్ చేస్తే నేలకు కొట్టిన బంతిలా ఎగిరి పడతానని అంబటి అన్నారు. జనసేన నాపై బురద చల్లడం ఇంతటితో ఆగదని, రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తారని అంబటి విమర్శించారు.
జనసేన ఎన్ని విమర్శలు చేసినా తాను భయపడనని అంబటి అన్నారు. తాను ధర్మాన్ని నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నానని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఆవేశపరుడు , జ్ఞానం లేని వాడని అంబటి విమర్శించారు.
జన సైనికుల పేరుతో అమాయకులను పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నాడని అంబటి ఆరోపించారు. తల్లిని దూషించిన వారిని క్షమించను అన్న వ్యక్తి వాళ్ల సంకే ఎక్కి పవన్ కళ్యాణ్ కూర్చున్నాడని మంత్రి అంబటి విమర్శించారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజీకి అమ్ముడు పోయే వ్యక్తి జనసైనికులు జాగ్రత్తగా ఉండండని అంబటి సూచించారు. వాస్తవాలు మాట్లాడే మంత్రులందరినీ జనసేన, టీడీపీ టార్గెట్ చేస్తోందని అంబటి మండిపడ్డారు.
ఇటీవలే జరిగిన యువశక్తి కార్యక్రమంలో పవన్ చేసిన వ్యాఖ్యలపై అంబటి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఒక్కడినే పోటీ చేయలేనని పవన్ ఒప్పుకున్నాడని, ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కు క్లారిటీ ఉందని అంబటి అభినందించారు.చంద్రబాబు తో పొత్తు లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడని అంబటి వివరించారు.
ఒక్కడినే వెళ్తే వీర మరణం అంటున్నాడని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను అంబటి గుర్తుచేశారు. నాకు దైర్యం ఎక్కువ అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ జగన్ ను చూస్తే భయపడుతున్నాడని, ఒంటరిగా వెళ్ళినా ఇద్దరు కలసి వెళ్ళినా మీకు ఓటమి తప్పదని అంబటి జోస్యం చెప్పారు.
సినిమా నటుడిని ప్రజలు వస్తున్నారని, పవన్ ఒక కామెడీ పీస్ అని జనాలకు అర్దం అయిపోయిందని అంబటి అన్నారు.సంస్కారం అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ మంత్రులను ఒరేయ్ తురెయ్ అనీ దూషిస్తున్నాడని అంబటి మండిపడ్డారుసంబరాల రాంబాబు అని మాట్లాడుతున్న వ్యక్తికి, మంత్రులను దూషిస్తున్న పవన్ కు సంస్కారం ఉందా? అని ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్, నాగ బాబు పిరికి సన్నాసులని అంబటి విమర్శించారు. అమాయక యువతను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి,జగన్ లాంటి వాళ్ళ మీద పవన్ అరుపులు ఏనుగు కుక్క సామెతను గుర్తుచేస్తోందని అన్నారు.
ప్యాకేజీ స్టార్ అంటే గొంతు పిసికి చంపేస్తాడా లేక మంత్రులందరిని భోజనం లో విషం పెట్టీ చంపేస్తాడా? అని పవన్ కళ్యాణ్ ను అంబటి ప్రశ్నించారు. రాజకీయాల్లో గ్యారంటీ కార్డు లు అడిగి పోటీ చేయడం ఏంటో అర్దం కావడం లేదని అన్నారు. ఇంగిత జ్ఞానం లేని పవన్ కళ్యాణ్ ,ప్యాకేజీ తీసుకున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
జన సైనికులను రెచ్చ గొట్టి పబ్బం గడుపుతున్నాడని, జగన్ మోహన్ రెడ్డి కష్టంలో ఉన్నప్పుడు ప్రజలతో ఉన్నాడని…ప్రజలను గ్యారంటీ కార్డు అడగలేదని అంబటి గుర్తుచేశారు. ఇలాంటి చీడ పురుగులకు రాష్ట్ర రాజకీయాల్లో స్థానం లేదని అంబటి అన్నారు. నువ్వు ఎవడితో కలసి వచ్చినా మీకు ఓటమి తప్పదని అంబటి ధీమా వ్యక్తం చేశారు.అమ్ముడు పోయే తాపత్రయం తప్ప అభివృద్ధి గురించి మాట్లాడే విధానం పవన్ కి లేదు..