PawanKalyan: ఇప్పటంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి హెచ్చరిక చేసారు. కూల్చివేతలతో పాలన ప్రారంభించిన ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరించారు. ఇప్పటంలో రోడ్ల విస్తరణ పేరుతో ఇళ్లు కూల్చివేస్తారా అని నిలదీసారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జనసేన అభిమానులకు చెందిన 53ఇళ్లను ప్రభుత్వం కూల్చివేయడంతో హుటాహుటిన పవన్ కళ్యాణ్ విజయవాడ చేరుకున్నారు. శుక్రవారం రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటం గ్రామంలో జనసేన అభిమానుల ఇళ్లను కూల్చివేయడంతో పవన్ హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు. నేడు ఇప్పటం గ్రామంలో పర్యటించనున్నారు.
విధ్వంసాలు సృష్టించడమే వైసీపీ సిద్ధాంతమని జనసేన పార్టీ ఆరోపించింది. గత మార్చిలో జనసేన ఆవిర్భావ సభ ఏర్పాటు కోసం భూములిచ్చారనే కోపంతో ఇప్పటం గ్రామంలో విధ్వంసం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కక్షగట్టి మరీ ఇప్పటం గ్రామంలో జనసేన మద్దతుదారుల ఇళ్లు ధ్వంసం చేశారని, బస్సు లేని గ్రామానికి 100 అడుగుల రోడ్డు పేరుతో ఇళ్ళు కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామంపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విజయవాడ చేరుకున్నారు. నేడు ఇప్పటం గ్రామంలో పర్యటించనున్నారు.ఇళ్లను కోల్పోయిన వారిని పరామర్శించనున్నారు.
ఇటీవల ఇప్పటం గ్రామస్తులు రూపాయి రూపాయి కూడబెట్టుకుని కమ్యూనిటీ హాలు కట్టి దానికి ఇప్పటం కమ్యూనిటీ హాల్ అని పేరు పెడితే దానిని సహించలేని వైసీపీ నాయకులు వెంటనే దాన్ని మేం నిర్మిస్తామని చెప్పి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆడిటోరియంగా పేరు మార్చారని ఆరోపించారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభకు స్థలం ఇవ్వద్దని రాత్రికి రాత్రి ఆ ప్రాంత ఎమ్మెల్యే వెళ్లి బెదిరించినా దారిలోకి రాలేదని అక్కసుతోనే ఇవన్నీ చేయిస్తున్నారని నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు ప్రతిఫలంగా పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామ అభివృద్ధికి 50 లక్షల సాయం ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే నేడు జనసేనాని ఇప్పటం గ్రామంలో పర్యటనతో పోలీసులు భారీగా మోహరించారు.
అయితే ఇప్పటం వెళ్లకుండా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం ముందే నిలువరించే ప్రయత్నం చేసారు పోలీసులు.. వాహనం దిగి పాదయాత్రగా ఇప్పటం బయలుదేరిన పవన్ కళ్యాణ్ ఆయనవెంట వందలమంది పాదయాత్రగా బయలుదేరారు కొంతసేపటికి మరొకవాహనంలో పవన్ ఇప్పటం చేరుకున్నారు.