Pawan kalyan Vijayawada Tour: నేడు ఇంద్రకీలాద్రికి జనసేనాని… ప్రత్యేక పూజలు
Pawan kalyan Vijayawada Tour: పవన్ కళ్యాణ్ నేడు విజయవాడలో పర్యటించనున్నారు. విజయవాడలో తన ఎన్నికల రథం వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో అమ్మవారిని దర్శించుకొని పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నాను. ఈ పూజలు ముగిసిన తరువాత పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ ఆఫీసుకు చేరుకుంటారు. పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది. ఈరోజు రేపు పవన్ కళ్యాణ్ మంగళగిరిలోనే ఉండనున్నారు. కాగా, ఒకవైపు ఆలయాలను దర్శించుకుంటూనే, మరోవైపు పార్టీ పనుల్లో బిజీగా ఉన్నారు.
వచ్చే ఏడాది జరిగే ఎన్నికల కోసం పవన్ ఇప్పటి నుండే వ్యూహాలు రచిస్తున్నారు. ఏపీలో ఎవరు పొత్తుకు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని హింట్ ఇచ్చారు. అదే సమయంలో గౌరవప్రదమైన పొత్తులు ఉంటాయని సున్నితంగా హెచ్చరించారు. తమతో పొత్తుపెట్టుకునే పార్టీ తమకు కూడా సమన్యాయం చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ఓట్లు చీలనీయబోమని చెబుతూనే వ్యూహాత్మకంగా పొత్తుల గురించి మాట్లాడుతున్నారు. ఎన్నికలకు సమయం ఉండటంతో పొత్తుల అంశం ఇప్పట్లో ఉండే అవకాశం లేదని, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ఇక రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో వారాహి వాహనానికి పూజలు చేయిస్తున్నారు. ఈ పూజలు ముగిసిన అనంతరం పవన్ కళ్యాణ్ ప్రచారం చేపట్టనున్నారు. తెలంగాణలోనూ పోటీ చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 25నుండి 40 అసెంబ్లీ స్థానాల్లోనూ 7 నుండి 14 లోక్ సభ స్థానాల్లోనూ పోటీ చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.