CBN – PK Meet : చంద్రబాబు ఇంటికి పవన్ – కీలక ప్రకటన..?
Pawan Kalyan Meets Chandrababu: ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తి కర పరిణామం. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత పవన్ చేరకున్నారు. చంద్రబాబు తో సమావేశమయ్యారు. ఇటీవల కుప్పంలో పోలీసులు చంద్రబాబుని, ఆయన పర్యటనను అడ్డుకున్నారు. జీవో నెంబర్ వన్ సాకుగా చూపుతూ మీరు ఇప్పుడు రోడ్డుమీద సభలు పెట్టడం కుదరదు అలాగే పర్యటన చేయడం కుదరదు అంటూ ఆయనను కట్టడి చేశారు.
ఈ నేపద్యంలోనే చంద్రబాబుని కలిసి పవన్ కళ్యాణ్ పరామర్శించేందుకు వచ్చారని తెలుస్తోంది. గతంలో వైజాగ్ లో పవన్ కళ్యాణ్ పోలీసులు అడ్డుకుని నిర్బంధించి వెనక్కి పంపిన సమయంలో పవన్ విజయవాడ రాగా అక్కడకు చంద్రబాబు వెళ్లి పరామర్శించారు. అయితే ఈ పరామర్శతో పొత్తుల ప్రస్తావన మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే అధికార వైసీపీ వీరిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని గురించి మరింత పదునుగా వ్యాఖ్యానించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది ఆసక్తిగా మారుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పటికప్పుడు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపక్షాలకు షాకిస్తూ ఒక జీవో తీసుకొచ్చింది. ఈ జీవో వల్ల ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలు కూడా చేయలేని పరిస్థితి నెలకొంది. భవిష్యత్తులో నారా లోకేష్ చేయబోతున్న పాదయాత్ర ప్రశ్నార్ధకంగా మారింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ చేయాలనుకున్న బస్సు యాత్ర కూడా జరుగుతుందా లేదా అనే డౌట్ లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇంటికి వెళ్లడం హాట్ టాపిక్ గా మారుతుంది.