Pawan Kalyan: వేర్పాటు వాదమంటే తోలుతీసి విరగ్గొడతా – మంత్రికి కౌంటర్?
Pawan Kalyan Strong Comments: ఎవడైనా వేర్పాటు వాదమంటే తోలుతీసి విరగ్గొడతా అంటూ పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీకి మూడు రాజధానులకు మద్దతు ఇస్తూ కొన్ని చోట్ల వైసీపీ నేతలు మూడు రాజధానులు కాకుంటే తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ కామెంట్లు చేస్తున్న క్రమంలో ఆయన ఈమేరకు ఘాటుగా స్పందించారు. వేర్పాటు వాద ధోరణితో ఎవరైనా మాట్లాడితే నాలాంటి తీవ్రవాదిని ఇంకొకరిని చూడరని పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. గణతంత్ర దినోత్సవం సంధర్భంగా జెండా వందనం తర్వాత ఆయన పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ ఈ కామెంట్లు చేశారు.
ఎవరికీ సమాధానం చెప్పక్కర్లేదని వైసీపీ నేతలు అనుకుంటున్నారు, వాళ్ల మెడలు వంచి జవాబు చెప్పిస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సంధర్భంగా వైసీపీ మంత్రిని ప్రస్తావిస్తూ ఏమయ్యా ధర్మాన.. నీకు మంత్రి ఇవ్వకపోతే ప్రత్యేక రాష్ట్రం కావాలా? అని ప్రశ్నించారు. ఇక ప్రధానిని కలిస్తే ఈసారి సజ్జల, వైసీపీ నేతలపై ఫిర్యాదు చేస్తానని పేర్కొన్న పవన్ కళ్యాణ్ నేను కోడి కత్తితో పొడిపించుకుని రాలేదు, చట్ట ప్రకారం వారాహికి అన్ని అనుమతులు తీసుకున్నా అంటూ జగన్ కోడికత్తి వ్యవహారాన్ని ప్రస్తావించారు. ఇక ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో సహా వేల కోట్లు కాజేశారని విమర్శించిన ఆయన వైసీపీది దేశీయ దొరతనం అని విమర్శించారు. ఇక ఈ సందర్భంగా తాను చట్టాలను గౌరవిస్తానని అన్నారు.