Pawan Kalyan: జనసేనుడి వ్యూహం ఏమిటి?
Pawan Kalyan: 2024 ఎన్నికల్లో జనసేన సత్తా చాటాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. వాస్తవానికి ఎన్నికల్లో గెలవాలంటే ప్రతి పార్టీకి తమదైన వ్యూహం ఉండాలి. ఇప్పటికే అధికార వైసిపి వై నాట్ అంటూ 175 కు 175 స్థానాలు దక్కించుకునే విధంగా ముందుకు వెళుతుంది. అలాగే ఆ పార్టీకి ఉన్న వ్యతిరేకతను ఎలా తొలగించుకోవాలి, ప్రభుత్వానికి ఉన్న మరకలు తుడిచేసి ప్రజలకు ఎలా దగ్గర అవ్వాలి అనే విషయం మీద ఫోకస్ పెడుతోం.ది ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టే మరకలు పడ్డ ఎమ్మెల్యేలను తీసి పక్కన పెట్టి కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు కూడా పార్టీ అధినేత జగన్ ఏమాత్రం వెనుకాడడం లేదు.
ఆ విధంగా వైసీపీ వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంటే తెలుగుదేశం కూడా అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూ చంద్రబాబును నమ్ముకుంటూనే అభివృద్ధి సాధ్యమని అంటుంది. అలాగే వైసిపి సంక్షేమాన్ని సైతం మేము ఎక్కడ కట్ చేయము, దాని కొనసాగిస్తామని చెబుతోంది. తాము వస్తే ఏవో పథకాలు ఆపేస్తామని జరుగుతున్న ప్రచారం కూడా నిజం కాదని చెబుతోంది. అయితే ఇంకా పూర్తిస్థాయిలో రంగంలోకి దిగని పార్టీ ఏదైనా ఉంది అంటే అది జనసేన మాత్రమే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమా షూటింగులు చేస్తూనే అందులో ఏమైనా గ్యాప్ దొరికితే అప్పుడు రాజకీయాల కోసం వెచ్చిస్తున్నారు. అయితే ఆసక్తికరంగా మునుపెన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ నాలుగు రోజులు పాటు మంగళగిరి పార్టీ ఆఫీసులోనే వరుస మీటింగ్స్ ప్లాన్ చేశారు. మరోపక్క జనసేన ఆవిర్భావ సభకు సైతం గట్టిగా ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికైతే పవన్ కు ఎన్నికల విషయంలో ఎలాంటి స్ట్రాటజీలు లేవు కానీ ఇప్పుడు ఏదైనా స్ట్రాటజీతో ముందుకు వెళతారా అనే విషయం మీద చర్చ జరుగుతుంది. పవన్ సొంత సామాజిక వర్గం అయిన కాపులు ఈసారి చంద్రబాబుతో వెళ్లకుండా సొంతంగా పవన్ ని పోటీ చేయమని సూచిస్తున్నారు. వైసీపీతో పాటు టిడిపిని కూడా విమర్శించాలని పవని సభాముఖంగా కోరడం ఆసక్తికరంగా మారింది. అయితే పవన్ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఏపీలో వైసీపీని అధికారుల నుంచి దూరం చేయాలనేది బలంగా భావిస్తున్నారు.
అయితే తాను సీఎం అవుతానా లేక చంద్రబాబు సీఎం అవుతారా అనేది పవన్ కి సెకండరీ అని అంటున్నారు. 20 -30 సీట్లలతో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లడం కంటే సొంతంగా పోటీ చేసి ఆ పాతిక 30 సీట్లు గెలిచి ముందుకు వెళ్లడం బెటర్ అని పవన్ భావిస్తున్నట్లుగా ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే విషయం మీద ఆధారపడి ఈ రాజకీయమంతా నడుస్తుంది. రిస్క్ ఎందుకు అనుకుంటే తక్కువ సీట్లు పొత్తుతో అయినా ముందుకు వెళతారా? లేదా సొంతంగా పోటీ చేసే అవకాశం ఉంటుందా? అనేది చూడాలి మరి ఏం జరగబోతోంది అని.