Pawan Kalyan Politics: అసలు రాజకీయం మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్!
Pawan Kalyan Politics: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో కచ్చితంగా సత్తా చాటాలని చూస్తున్నారు. వాస్తవానికి జనసేన పార్టీ 2014లోనే స్థాపించినా అప్పుడు జనసేన బిజెపి- టిడిపి కూటమికి మద్దతు పలికింది. తమ తరఫున ఒక్క అభ్యర్థిని కూడా రంగంలోకి దింపకుండా ఆ రెండు పార్టీలకు పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. 2019 కి వచ్చేసరికి పరిస్థితులు మారిపోయాయి. బిజెపి ఒకపక్క పవన్ కళ్యాణ్ మరోపక్క తెలుగుదేశం ఇంకో పక్క పోటీ చేస్తే ఈ మూడు విఫలమై వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇక ఇప్పుడు ఏపీ రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ఒక హాట్ టాపిక్ గా మారిపోయారు. ఎందుకంటే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న కామెంట్లు ఇతర పార్టీలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించి మరో ఏడాది గడిస్తే 10 ఏళ్లవుతాయి కానీ ఆయన స్వయంగా ఎక్కడా గెలవకపోవడం గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా తన పార్టీలో లేకపోవడంతో పవన్ కళ్యాణ్ పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తాడు, జనసేన పార్టీకి స్థిరత్వం లేదు అంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయ. ఇలాంటి పార్టీ రాజకీయాల్లో నెట్టుకు రావడం అనే విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన పంధా మార్చారు. ప్రభుత్వం మీద పోరాట స్టైల్ కూడా మార్చడంతో ఎవరు ఊహించని విధంగా జనసేన పుంజుకుంది. అందుకే ఎప్పుడు మాట్లాడినా జనసేనను టార్గెట్ చేస్తూ ప్రభుత్వ పెద్దలు విరుచుకుపడుతున్నారు. ఇక ప్రస్తుతం జనసేన ఓటు బ్యాంకు భారీగా పెరుగుతుందని అంచనాలు వినిపిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన అసలు రాజకీయం మొదలు పెట్టారని అంటున్నారు.
ఈసారి జనసేనతో పొత్తు పెట్టుకోవడం తెలుగుదేశం పార్టీకి అత్యవసరం. ఈ నేపథ్యంలోనే సీఎం పదవి మీద పవన్ కళ్యాణ్ గట్టిగా ఫోకస్ పెట్టారని, టిడిపి జనసేన కలిసి పొత్తులో పోటీ చేయాలంటే అభ్యర్థిగా తననే ప్రకటించాలని ఆయన డిమాండ్ చేసే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు దేశం పార్టీకి మద్దతు ఇవ్వకపోయినా జనసేనకు నష్టమేమీ లేదు. ఎందుకంటే జనసేనకు వచ్చే సీట్లు కచ్చితంగా ఫిక్స్ అయిపోయాయని అంటున్నారు. తెలుగుదేశంతో కలిస్తే అధికారం ఏర్పాటు చేయవచ్చు కలవకపోతే కొన్ని సీట్లు మాత్రమే తెచ్చుకుని ఆ కొందరు ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు.
కాబట్టి తమ అవసరమే తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా ఉందని అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్ సీఎం సీటు మీద ఫోకస్ పెట్టినట్లుగా చెబుతున్నారు. ఆయన ఒంటరిగా పోటీ చేస్తే ఎన్నికల్లో ఒక్క పార్టీకి కూడా మ్యాజిక్ ఫిగర్ దాటదు, ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్థాపించడం కోసం ఏదో ఒక పార్టీ జనసేన మద్దతు కోరే అవకాశం ఉంటుందని అప్పుడు జనసేన డిమాండ్స్ నెరవేర్చక తప్పదని అంటున్నారు. ఇన్నాళ్లు పార్ట్ టైం పొలిటీషియన్ అనిపించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తిస్థాయి పొలిటీషియన్ గా ఇతర పార్టీల నేతలకు కనిపిస్తున్నాడని ఆయన సీఎం పదవి నేరుగా అడిగినా ఆశ్చర్యం లేదని వారందరూ భావిస్తున్నారని అంటున్నారు. చూడాలి రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది అనేది.