Pawan Strategy: జనసేనాని మౌనమేల?
Pawan Strategy: 2024 ఎన్నికల దగ్గర పడుతున్న ఏపీలో పొత్తుల గురించి ప్రచారాలే తప్ప అసలు విషయం ఏమిటంటే ఎవరికీ క్లారిటీ లేదు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ వైఖరి ఏమిటి అనే విషయం మీద ఎవరు ఏమీ చెప్పలేని పరిస్థితి నెలకొంది. కచ్చితంగా 2024 ఎన్నికల్లో సత్తా చాటి ఏదో ఒక విధంగా ప్రభుత్వ ఏర్పాటులో తన హ్యాండ్ ఉండాలని పవన్ భావిస్తున్నారు కానీ ఆ దిశగా ఆయన అడుగులు పడడం లేదని విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పొత్తుల విషయంలో పవన్ కళ్యాణ్ వైఖరి ఏమిటి అనే విషయం మీద ఎవరికీ క్లారిటీ రావడం లేదు.
రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకుండా చూస్తాను అంటూ పవన్ చెబుతున్నారు. కానీ అసలు ఆయన ఉద్దేశం ఏమిటి అనే విషయం మీద ఎవరికీ క్లారిటీ రావడం లేదు. టిడిపి అయితే ఆయన తమతోనే కలిసినడుస్తాడని చాలా ఆశలు పెట్టుకుంది, వైసీపీని ఎలా అయినా పవన్తో కలిసి అధికారాన్ని దూరం చేయవచ్చు అని టిడిపి నేతలు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో బీజేపీ పొత్తు కూడా తమకు కలిసి రాబోతుందని కచ్చితంగా వైసీపీని అధికారానికి దూరం చేయవచ్చు అని టిడిపి భావిస్తోంది. అయితే పొత్తుల విషయంలో పవన్ కళ్యాణ్ ఏం ఆలోచిస్తున్నారనే విషయం ఎవరికీ అంత చిక్కడం లేదు. ఎందుకంటే ఈ విషయం మీద అయినా ఓపెన్ గా ఎలాంటి కామెంట్స్ చేయడం లేదు, దీంతో పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహం ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు చర్చినీయాంశం అవుతుంది. జనసేన నాయకులకు కాపు సామాజిక వర్గం వారికి కూడా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏమి ఆలోచిస్తున్నాడు? ఆయన వైసీపీని అధికారానికి దూరం చేసేందుకు ప్రయత్నిస్తాడా లేక సీఎం చైర్ కోసం ప్రయత్నిస్తాడా? అనే విషయం మీద కూడా ఎవరు ఏమి చెప్పలేని పరిస్థితి నెలకొంది.
పొత్తుల విషయంలో అలాగే రాజకీయంగా ఎలా ముందుకు వెళతారు అనే విషయం మీద పవన్ కళ్యాణ్ కి క్లారిటీ లేకపోవడంతో ఇతర పార్టీల నుంచి జనసేన వైపు వలస రావాలని భావిస్తున్న వారు కూడా ఆలోచనలో పడినట్లుగా చెబుతున్నారు. నిజానికి ఇటీవల టిడిపిలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ సైతం ముందుగా జనసేనలో చేరాలని ప్రయత్నించారు కానీ జనసేన నుంచి సరైన స్పందన రాకపోవడంతో టిడిపి తీర్థం పుచ్చుకున్నారని అంటున్నారు. అలాగే టిడిపి నుంచి జనసేనలో చేరాలని చూసిన వంగవీటి రాధాకృష్ణ సైతం టిడిపిలోనే ఉండడానికి కూడా పవన్ కళ్యాణ్ ఏ కారణం అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ వ్యూహం ఏమిటి? అని ఎలా ముందుకు వెళతారు అనే విషయం మీద ఎవరికీ సరైన క్లారిటీ లేకపోవడంతో ఆయనతో రిస్క్ ఎందుకు చేయడం అని జనసేనకు దూరం పాటిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చూడాలి ఇది ఎంతవరకు వెళుతుంది అనేది.