Pawankalyan: కాపులకు రాజ్యాధికారం రావాలి..ఎవరి అజెండా నేను మోయను..పవన్
Pawankalyan: కాపుల దగ్గర ఆర్థిక బలం తక్కువని, సంఖ్యాబలం ఉన్నా ఐక్యత లేదని అన్నారు పవన్ కళ్యాణ్. వారు నిలబడితే కచ్చితంగా అధికారం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాపులు గోదావరి జిల్లాల్లో మాత్రమే లేరు.. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రంలో కూడా ఉన్నారని.. అందరూ కలిసి ఉంటే దక్షిణ భారతదేశంలో.. అతి పెద్ద సమాజం కాపు సమాజం అవుతుందని వ్యాఖ్యానించారు.
నాకు భాద ఉంది కాబట్టి పార్టీ నడుపుతున్నాను. లక్షలాది మంది ప్రజల జీవితాల కోసం నడుపుతున్నాను. జనసేన ప్రజల భావోద్వేగాలను నమ్మింది. కాపులకు రాజ్యాధికారం రావాలన్నారు. ఎవరి అజెండా నేను మోయను నా అజెండా నేను మోస్తానని అన్నారు. పవన్ కల్యాణ్. రాయలసీమలో బలిజలు గొంతు ఎత్తలేరు. దానికి కారణం భయం కాదు.. ఐక్యత లేకపోవడం. ఐక్యత ఉంటేనే రాజ్యాధికారం సాధ్యం. నన్ను నా సామాజికవర్గం వాళ్లతోనే తిట్టిస్తున్నారు. నేను ఓడిపోతే కాపులు తొడగొట్టారు. మీరుమీరు కొట్టుకు చావండి అన్నట్లుగా అధికార పార్టీ వైఖరి ఉంది. దీనిని గుర్తించనంత వరకు రాజ్యాధికారం అనే విషయం మర్చిపోవాలన్నారు.
అన్ని కులాలను సమానంగా చూస్తేనే నాయకత్వం వహించగలం అని అన్నారు. అన్ని కులాలను సమానంగా చూస్తేనే నాయకత్వం వహించగలం అని అన్నారు. జనసేన నాయకులూ గ్రామాల్లో పెద్దన్న పాత్ర పోషిస్తూ.. అన్ని కులాలనూ కలుపుకొని వెళ్లాలన్నారు. ఇక జనసేన 10వ ఆవిర్భావ సభ ను రేపు మచిలీపట్నంలో నిర్వహించనున్నారు. దీన్ని భారీ ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. అధినేత పవన్ కల్యాణ్ ఈ సభకు వారాహి వాహనంలో వేదిక వద్దకు చేరుకోనున్నారు. సభా వేదికకు పొట్టి శ్రీరాములు పేరును పెట్టారు. ఆవిర్భావ సభ పోస్టర్ కూడా ఆవిష్కరించారు.