PawanKalyan: జాతీయజెండా ఆవిష్కరించిన పవన్..
PawanKalyan: 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళగిరి లోని జనసేన పార్టీ కార్యాలయంలో గణతంత్రదినోత్సవం సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారుజనసేన నేతలు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మహాత్మా గాంధీ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నమస్కరించారు. ఈ వేడుకలో నాదెండ్ల మనోహర్ తో పాటు..జనసైనికులు,పార్టీ శ్రేణులుపాల్గొన్నారు. ఇక జాతీయ జెండా ఆవిషరించిన పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..చాలామందికి రి పబ్లిక్ డే అంటే తెలియదు. 1947 లో స్వాతంత్రము వచ్చింది మళ్ళీ ఎందుకు రిపబ్లిక్ అని చర్చ జరుగుతుంటుందన్నారు. మహోన్నత రాజ్యాంగాన్నిఅంబేద్కర్ అందించారు. కేంద్రప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రప్రభుత్వానికి కృతజ్ఞతలను తెలుపారు.
ఇక జాతీయజెండాని చెప్పులేసుకుని పవన్ ఆవిష్కరించాడని మహనీయుల ఫొటోలకు పూల దండలు వేయటం పైన వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అవమానపరిచాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీతులు చెప్పేపవన్ ముందు తాను నేర్చుకోవాల్సింది చాలాఉందని అన్నారు. జాతీయజెండాని అవమానపరచిన పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పితీరాల్సిందే అనిఅన్నారు.