ఎమ్మెల్సీ చేసిన హత్యను కవర్ చేసుకోవడానికి కోనసీమ గొడవ!
కోనసీమలో చిచ్చుపెట్టింది వైసీపీనే అని జనసేనాని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అభ్యంతరాలను వ్యక్తులు మాత్రమే ఇవ్వాలనే షరతు కోనసీమలోనే పెట్టారు ఎందుకు?, సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనే మంత్రులు, పోలీసులు నానా హడావిడి చేస్తారన్న ఆయన ఇంతవరకు ఎలా రానిచ్చారని ప్రశ్నించారు. భావోద్వేగాలను రెచ్చగొట్టడానికే 30 రోజుల గడువు అని పవన్ కల్యాణ్ విమర్శించారు. మంత్రి ఇంటిమీద దాడి జరిగితే యంత్రాంగం ప్రేక్షక పాత్ర పోషించేలా చేశారని, పోలీసులను అప్రమత్తం చేయకపోవడం ముందస్తు ప్రణాళికే అని ఆయన విమర్శించారు, దాడులు అడ్డుకోవడానికి అవకాశం ఉన్నా ఆ పని చేయలేని, వైసీపీ ఎమ్మెల్సీ చేసిన హత్యను కవర్ చేసుకోవడానికి కోనసీమ గొడవ సృష్టించారని అన్నారు.
ఈ సమయంలో ఈ గొడవ వచ్చిందంటే కారణం ఏంటి?.. కడప జిల్లాకే అంబేద్కర్ పేరు పెట్టుకుని ఉండొచ్చు కదా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. అంబేడ్కర్ కు గౌరవం ఇవ్వడమంటే ఆయన సిద్దాంతాలు పాటించడం అని పవన్ అన్నారు. ఎస్పీలలో బలం తగ్గుతుంది అని భావించి వైసీపీ నేతలే ప్లాన్ చేసి గొడవలకు తెరలేపారని ఆరోపించారు. వారి మీద వారే దాడి చేయించుకుని సింపతీ కోసం చూస్తున్నారని మండిపడ్డారు. నిన్న జరిగిన అల్లర్లలో జనసేన పార్టీకి చెందిన నేతలు ఉన్నారని హోమంత్రి తానేటి వనిత చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసిందని పవన్ వెల్లడించారు.