Public Voice:భీమవరంలో ప్రజావాణి కార్యక్రమం.. పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్
Pawan Kalyan Fire on AP Govt: భీమవరంలో జనసేన పార్టీ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అనేక మంది ప్రజలు పవన్‌కు తమ సమస్యల గురించి వివరించి వినతి పత్రాన్ని ఇచ్చారు. అనంతరం పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే.. ప్రభుత్వం కలెక్టర్ నుంచి ఆర్డీవో వరకు అందరినీ రంగంలోకి దించుతుంది. కానీ, ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు వ్యవస్థలు ఎందుకు పనిచేయవని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
151 మంది ఎమ్మెల్యేలు ఉంటే సీఎం జగన్ చాలా అద్భుతాలు చేశారని పవన్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలను గాలికి వదిలేసి ఎవరిని తొక్కేద్దామా అనే ఆలోచనలతోనే జీవిస్తుంటారని మండిపడ్డారు. అర్హులకు ఇంత వరకు ఇళ్ల పట్టాలు, టిడ్కో హౌసింగ్ సమస్యలు, మౌలిక వసతులను ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి ప్రజలకు మేలు చేసే పనులు తక్కువ.. ఇతరుల విషయాల్లో తలదూర్చడాలు ఎక్కువన్నారు. శత్రువులపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై ఉండదన్నారు. ప్రత్యర్థులపై దాడి చేయాలంటే కలెక్టర్, చీఫ్ సెక్రటరీ అందరూ ముందుకొస్తారన్నారు. 5, 10, 15 రూపాయల సినిమాల కోసం వ్యవస్థను మొత్తం నడపగలరు కానీ, సగటు మనిషి సమస్యల పరిష్కారానికి ఎందుకు బయటకు రారని పవన్ ప్రశ్నించారు.