Pawan Kalyan: బాబుతో భేటీ అందుకే.. పవన్ ఏమంటున్నారంటే?
Pawan Kalyan Comments on Chandrababu Meeting: చంద్రబాబును కలిసిన పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ భేటీ అనంతరం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంయుక్తంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఇక పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ కుప్పంలో చంద్రబాబును ఆపిన సంఘటనపై కలిశామని అన్నారు. ఇక ఈ భేటీలో వైసీపీ అరాచకాలపై మాట్లాడుకున్నామని అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబుకు ఏపీలో ఎక్కడైనా తిరిగే హక్కు ఉందని కానీ దాన్ని అడ్డుకుంటున్నారు అని అన్నారు. వైసీపీ అరాచక పాలన చేస్తోందని పేర్కొన్న పవన్ వైసీపీకి తన బాధ్యత లు గుర్తు చేయాలని, రైతు సమస్యలు… పెన్షన్ తొలగింపుపై వంటి అంశాల మీద కూడా మాట్లాడుకున్నామని అన్నారు. బ్రిటిష్ కాలం నాటి జీవో తెచ్చారని పేర్కొన్న పవన్
వైజాగ్ లో కూడా నన్ను అడ్డుకున్నారని, ఇప్పటం వెళ్దాం అంటే బయటకు రావద్దు అనే పరిస్థితి వచ్చిందని అన్నారు. ఇక మమ్మల్ని ఫ్లెక్సీ వాడొద్దు అంటారు కానీ ఆయనకి మాత్రం ఫ్లెక్సీలు పెట్టుకుంటారని అన్నారు. రూల్ అందరికి అప్లికేబుల్ అంటారు కానీ అమలు లేదని పవన్ అన్నారు. ఇక తొక్కిసలాట ఘటనల మీద స్పందిస్తూ 10 మంది గుమిగుడితే పోలీసులదే బాధ్యత అని పొలిటికల్ పార్టీ ముందే అనుమతి కోరుతుందని అన్నారు. రక్షణ కల్పించడం పోలీసుల బాధ్యత అని మా మీటింగులకు మేమే లాఠీలు పట్టుకోవాలా? అని ఆయన ప్రశ్నించారు. ఇక సభలలో తొక్కిసలాట ఘటనలకు లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అని పవన్ తేల్చి చెప్పారు.