Pawan Kalyan: పొత్తులపై తేల్చేసిన జనసేనాని
Pawan Kalyan Comments at Yuvashakthi Sabha: పవన్ కల్యాణ్ పొత్తులపైన క్లారిటీ ఇచ్చారు. గౌరవం తగ్గకుండా ఉంటేనే పొత్తు ఉంటుందని, లేకపోతే ఒంటరి పోరాటం తప్పదని స్పష్టం చేసారు. ఒంటరిగా వెళ్లి వీరమరణం అవసరం లేదని పవన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తాను బాధ్యత తీసుకుంటానని స్పష్టం చేసారు. తనను నమ్మాలని, నమ్మి ఓటు వేయాలని పవన్ పిలుపునిచ్చారు.శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరుగుతున్న యువశక్తి సభలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
నేను సాధించిన దానికి సంతోషం లేదు కానీ నేను ఈరోజు ప్రతి సన్నాసి , ఎదవ చేత మాట అనిపించుకోకుండా ఉండగలనని అన్నారు. కేవలం మన కోసం జీవించే జీవితం కాకుండా సాటిమనిషిని గురించి బతకడం ఇష్టం అని అన్నారు. రాజకీయ నేతలు ప్రజలను బానిసలుగా చూస్తున్నారని, పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు నా వద్ద అంత సమూహాం లేదని అన్నారు. మహా అయితే నా ప్రాణం పోతుంది, పిరికి తనం నాకు చిరాకు అని అన్నారు. ఈ రాజకీయ నాయకులు ఏం దిగొచ్చారా? అని పవన్ ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర పోరాటాల గడ్డ అని పేర్కొన్న ఆయన ఉపాధిలేనప్పుడు , వలసపై నాయకులు నిలదీయకపొతే ఎలా..? అని ప్రశ్నించారు.
గిడుగు రామ్మూర్తి , శ్రీ శ్రీ , చాసో , రావిశాస్ర్తి గార్లు నాకు ఆదర్శం అని అన్నారు. యువతలో వ్యవస్థ మీద కోపంతో పాటు భయం కూడా ఉందని ఆయన అన్నారు. ఉత్తరాంద్ర కళింగాంద్ర కాదు కలియబడి పోరాడే ప్రాంతం అని ఆయన అన్నారు. నా ఆఖరి శ్వాస వరకు రాజకీయాలను వదలనని అన్నారు. రణస్థలం నుంచి హామీ ఇస్తున్నానని అన్నారు. పూర్తి స్దాయి నాయకులంటే ఎవరు..? అని ప్రశ్నించిన పవన్ నేను సినిమాలు చేయాలి నాకు వేరేదారి లేదని అన్నారు. డబ్బు నాకు అవసరం లేని రోజు వస్తే సినిమాలు వదిలేస్తానని పేర్కొన్న పవన్ మన భవిష్యత్ కాలరాస్తున్న వ్యక్తులు ఎవరు? అని ప్రశ్నించారు. రైతులకు గిట్టుబాటు ధరలేదు, నిరుద్యోగులకు ఉద్యోగం లేదు, ఉద్యోగులకు జీతం లేదు అని పవన్ విమర్శించారు. మూడు ముక్కల ముఖ్యమంత్రి ఉన్నారని ఎద్దేవా చేసిన పవన్ మీనాన్నవైఎస్ రాజశేఖరరెడ్డినే ఎదుర్కొన్నొడినని, పంచలూడ దీసికొడతా అన్నానని అన్నారు. మీనాన్న మనుషులు స్టేజ్ కుల్చెయడం, బెదిరించడం కూడా చూశానని అన్నారు.
చిన్నవయసులోనే తీవ్రవాద ఉద్యమం వైపు వెల్లాలని కూడా బావించేవాడిని, నేను కాంప్రమైజ్ అయి బ్రతకలేనని అన్నారు. పట్టుమని పదిమందిని ఇచ్చుంటే మరింత పెద్ద ఎత్తున సభల్లో పొరాడగలనని అన్నారు. డైమండ్ రాణీ రోజా కూడా నాగూర్చి మాటాడుతుంది, చీ.. నా బతుకు చెడ.. మీకొసం డైమండ్ రాణితో , సంబరాల రాంబాబు తో తిట్టించుకుంటున్నా అంటూ ఆయన అన్నారు. పనికిమాలిన నీచ నికృష్ట కమీన్ ఐటీ మంత్రి మహిళ మీద మర్డర్ కేసు పెట్టాడని, నా మీద సుపారి ఇస్తారు. చంపేస్తాం అంటారని అన్నారు. ఇలాంటి ఎదవలకి భయపడే రకం కాదు, పోరాడకపోతే రంగస్థలం సినిమాలోలా భయపడండని అన్నారు. బ్రిటీష్ వారిని తరిమికొట్టిన గున్నమ్మ పుట్టిన నేల ఇది, స్పుర్తిగా తిసుకొనిగొంతు ఎత్తక పొతే మీగొంతు నొక్కెస్తారని అన్నారు.