Pawankalyan: జనసేన ప్రయోగాలు చేయదు.. పవన్ కళ్యాణ్
Pawankalyan: మచిలీపట్నంలో జనసేన 10వ ఆవిర్భావ సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీ అభిమానమే తనకు శ్రీరామరక్ష అని పవన్ కల్యాణ్ అన్నారు. తాను అనుకున్నట్టుగా జనసేన, బీజేపీ ఉమ్మడి కార్యాచరణ జరిగి ఉంటే వైసీపీ వ్యతిరేక ఓటు అనే మాట వచ్చేది కాదని స్పష్టం చేశారు. తనకు సంపూర్ణ నమ్మకం వస్తేనే పొత్తులు కుదురుతాయని జసేనన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు.
ప్రత్యేక హోదా కోసం తాను పట్టుబడితే అందరూ తనను ఒంటరిని చేశారన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు రెండు పార్టీలు కలసి పనిచేసుంటే ఇప్పటికే టీడీపీ కంటే బలపడేవాళ్లమన్నారు. తెలుగుదేశం మీద తనకు ప్రత్యేక ప్రేమ లేదన్నారు. చంద్రబాబు అంటే గౌరవమేనని అన్నారు. ఈ సారి తాము అసెంబ్లీలో అడుగుపెడతామన్నారు. పొత్తుల గురించి తాను ఎక్కడా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. వాట్సాప్ మెసేజులు చూసి మీరు నమ్మేస్తే ఎలా అని ప్రశ్నించారు. వైసీపీ కులాలను విడదీసే కుట్ర చేస్తుందని అన్నారు. మేము ఎన్నిస్థానాలలో పోటీచేయాలో మాకుతెలుసు175 స్థానాల్లో పోటీ చేయమనడానికి మీరెవరని ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఈసారి ఎన్నికలకు జనసేన బలిపశువు కాదని, ప్రయోగాలు చేయబోనని, అసెంబ్లీలోకి ఖచ్చితంగా అడుగుపెడతామని తెలిపారు. తనతో పాటు పోటీ చేసిన వాళ్లంతా అసెంబ్లీలోకి వెళ్లాల్సిందేనన్నారు. వెయ్యి కోట్లు ప్యాకేజీ తీసుకున్నానన్నారు. నాకు డబ్బులకు కొదవ లేదనీ.. మరోసారి ప్యాకేజీ అంటే చెప్పుతో కొడతానని అన్నారు. సినిమాలతోనే తానకు కావాల్సిన డబ్బులు సంపాదించుకుంటానన్నారు. ఈసారి గెలిచిన తర్వాత ఆవిర్భావ దినోత్సవం జరుపుకుందామని తెలిపారు.