ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 11, 12 తేదీల్లో విశాఖలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గోనున్నారు. రోడ్ షో, బహిరంగ సభలో పాల్గొంటారు. దీంతో భద్రతా ఏర్పాట్లు చాలా పటిష్టంగా కొనసాగుతున్నాయి. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ బృందాలు విశాఖకు చేరుకుంటాయి. దీంతో పాటు ప్రధాని పర్యటనకు 5 వేల మంది పోలీసులు పహారా కాయనున్నారు
ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 11, 12 తేదీల్లో విశాఖలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గోనున్నారు. రోడ్ షో, బహిరంగ సభలో పాల్గొంటారు. దీంతో భద్రతా ఏర్పాట్లు చాలా పటిష్టంగా కొనసాగుతున్నాయి. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ బృందాలు విశాఖకు చేరుకుంటాయి. దీంతో పాటు ప్రధాని పర్యటనకు 5 వేల మంది పోలీసులు పహారా కాయనున్నారు. ఎల్లుండి నుంచి విశాఖకు అదనపు బలగాలు చేరుకోనున్నాయి.
INS డేగ ద్వారా ప్రధాని విశాఖలో అడుగుపెట్టనున్నారు. ఈస్ట్రన్ నేవల్ కమాండ్‌కి చెందిన INS చోళ ప్రాంతంలో ప్రధానికి బస ఏర్పాటు చేయనున్నారు.
ప్రధాని విశాఖ పర్యటన సందర్భంగా 10,842 కోట్ల విలువైన 7 ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. 460 కోట్ల రూపాయల విలువైన రైల్వే రీడెవలప్మెంట్ పనులు, 152 కోట్ల రూపాయల విలువైన ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ పనులు, 566 కోట్ల రూపాయల ఖర్చుతో కూడిన షీలా నగర్, కాన్వెంట్ రోడ్ విస్తరణ పనులు, 2658 కోట్ల రూపాయల ఖర్చుతో కూడిన శ్రీకాకుళం నుంచి అంగుల్ వరకు GAIL పైప్‌లైన్ పనులు, 211 కోట్ల రూపాయల ఖర్చుతో కూడిన ఇచ్చాపురం, పర్లాకిమిడి రోడ్డు విస్తరణ పనులు, 2917 కోట్ల రూపాయలతో ఖర్చుతో కూడిన ONGC ఫీల్డ్ డెవలప్మెంట్ పనులు, 3778 కోట్ల రూపాయల ఖర్చుతో కూడిన విశాఖ రాయ్‌పుర్ గ్రీన్‌ఫీల్డ్ ఎకనామిక్ కారిడార్ పనులను ప్రధాని ప్రారంభించనున్నారు.
నవంబర్ 11 మధ్యాహ్నం ఏపీ సీఎం జగన్ విశాఖ చేరుకుంటారు. ప్రధానికి స్వాగతం పలకనున్నారు. ప్రధాని మోడీ పాల్గొనే కార్యక్రమాల్లో ఏపీ సీఎం జగన్ కూడా పాల్గొంటారు.
ప్రధాని బహిరంగ సభ జరగనున్న ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణం సర్వంగా సందురంగా ముస్తాబవుతోంది. భద్రతా కారణాల పేరుతో చెట్లను తొలగిస్తున్నారు. భారీ వృక్షాలను సైతం తొలగించి పార్కుల్లో నాటుతున్నారు. రెండు రోజుల క్రితం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఏర్పాట్లును స్వయంగా పరిశీలించారు. జిల్లా కలెక్టర్ మల్లికార్జున్, సిటీ పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ కూడా విజయసాయిరెడ్డితో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు.