YSRCP MLAs: ఆ 14 ఎమ్మెల్యేలకు షాకివ్వనున్న జగన్..?
NO MLA Tickets to those 14 YSRCP MLAs: ఆంధ్రప్రదేశ్ 2019 ఎన్నికల్లో బంపర్ మెజారిటీ సాధించిన వైఎస్ జగన్ 2024 లో కూడా తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని చూస్తున్నారు. 2019లో 151 సీట్లు సంపాదిస్తే ఈసారి 175 సీట్లు సాధించాలంటూ టార్గెట్ నిర్దేశించి మరీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఒక రకంగా ఆయన ఎన్నికల సన్నాహాలు మొదలు పెట్టారు అని చెప్పాలి. వివిధ నియోజకవర్గాలలో తన పార్టీ పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ఉన్న అభ్యర్థుల పనితీరు, వారి బలహీనతలు ఏమిటి? వారి బలాలు ఏమిటి? ఇలా కూలంకషంగా అన్ని విషయాలను చర్చిస్తూ ఆ నియోజకవర్గ కేడర్ను కూడా పిలిపించి మరీ వారి వారి అభిప్రాయాలు కూడా తెలుసుకుంటున్నారు.
ఇక ఇప్పటికే పీకే టీం తో డీల్ కుదుర్చుకున్న వైయస్ జగన్ తన అభ్యర్థులందరి మీద సర్వేలు చేయిస్తున్నారు. తాజాగా అన్ని విషయాలను పరిశీలించిన పీకే టీమ్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలా బలహీనంగా ఉన్న 14 నియోజకవర్గాల గురించి వైయస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ నియోజకవర్గాల మీద సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా మళ్లీ పలుసార్లు సర్వే చేయించిన జగన్ ఈసారి ఈ నియోజకవర్గాల విషయంలో సంచలన నిర్ణయానికి రావడం ఇప్పుడు వైసీపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎప్పటికప్పుడు తన ఎమ్మెల్యేలతో కూడా గడపగడపకు అనే ప్రోగ్రాం విషయంలో అనేక సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్న జగన్ ఇప్పటికే పలు దఫాలు హెచ్చరించారు. మీరు కనుక ప్రజల్లోకి వెళ్లకపోతే తీసి పక్కన పెట్టడానికి ఏమాత్రం సంకోచించను అని ఆయన ఇప్పటికే అనేక సూచనలు పంపినా ఆ 14 మంది మాత్రం ఇంకా ఈ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఆ 14 నియోజకవర్గాలకు సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ పనితీరు మార్చుకోకపోవడంతో ఇప్పుడు వైఎస్ జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఆ 14 నియోజకవర్గాల్లో వారికి ప్రత్యామ్నాయంగా ఎవరిని నిలబెడితే ఎన్నికల్లో ఎలాంటి ఢోకా ఉండదు అనే విషయం మీద జగన్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఆ ఎమ్మెల్యేలు ఎవరా? అని ఆరా తీస్తే ముగ్గురు ఎమ్మెల్యేలు గుంటూరు జిల్లాకు చెందినవారు ఉన్నారని ఇప్పటికే వారికి వైఎస్ జగన్ తన నిర్ణయాన్ని కూడా చూచాయగా వారికి తేల్చి చెప్పారని ప్రచారం జరుగుతోంది.
ఈ ఎమ్మెల్యేలందరూ ఖచ్చితంగా తమకు వచ్చే ఎన్నికల్లో సీట్లు సంపాదించుకునే దిశగా పార్టీ కీలక నేతలతో లాబీయింగ్ కూడా చేయిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే వైఎస్ జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశమే ఉండదు. కాబట్టి ఆయన సన్నిహితులు మాత్రం ఈ 14 మందికి ఈసారి టికెట్లు లేనట్లే అని కచ్చితంగా చెబుతున్నారట. ఈ జాబితాలో గుంటూరు జిల్లాకు చెందిన వారు ముగ్గురు ఉండగా కృష్ణా జిల్లాకు చెందిన మంత్రులు ఇద్దరు ఉన్నారని అలాగే పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి గుంటూరు సహా రాయలసీమ జిల్లాలకు చెందిన వారు మిగతా ఎమ్మెల్యేలు అనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు కానీ జగన్ అనుకున్నది చేసి తీరుతారనే ప్రచారాల నేపథ్యంలో ఎలాంటి కీలక విషయాలు బయటకు వస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.