Mega Twist: అసలు అన్నయ్య పొలిటికల్ స్టేటస్ ఏంటి?
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రాజకీయాలకు దూరమై ఇప్పుడు సినిమా వ్యవహారాలు చూసుకుంటూ బిజీ బిజీగా గడుపుతున్నారు. గతంలో ఆయన రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నా రాష్ట్ర విభజన తరువాత పూర్తిగా రాజకీయాలను పక్కన పెట్టేశారు. వరుస సినిమాల్లో నటిస్తూ, తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్దన్న పాత్రలో బిజీ అయ్యేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. అయితే చిరంజీవి సోదరులలో ఒకరైన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించినా సరే చిరంజీవి ఎక్కడా ఇప్పటివరకు బహిరంగంగా జనసేనకు మద్దతు పలకలేదు సరికదా నేను రాజకీయాలకి దూరం అంటూ కొన్ని డైలాగులు కూడా వాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే చిరంజీవి గతంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి, ఆ తర్వాత కాంగ్రెస్ లో దానిని విలీనం చేసి కాంగ్రెస్ నుంచిహ్ రాజ్యసభ సభ్యత్వం స్వీకరించి కేంద్ర మంత్రి పదవి కూడా నిర్వహించారు. కాంగ్రెస్ అధికారం కోల్పోయాక కూడా తన రాజ్యసభ సభ్యత్వం ముగిసే వరకు ఆ పార్టీలోనే కొనసాగినా తర్వాత చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా దూరంగా ఉంటున్నారు.
ఆయన ఆ పార్టీకి రాజీనామా చేయలేదని ఆయన మా వాడే అని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నా చిరంజీవి కూడా ఆ పార్టీలోనే ఉన్నా.. లేనట్టుగానే వ్యవహరిస్తున్నారు. అప్పుడప్పుడు రాజకీయ అంశాలు ప్రస్తావనకు వచనప్పుడు తాను పూర్తిగా సినిమాలు పైనే దృష్టి పెట్టానని నాకు రాజకీయం దూరం అన్నట్టుగా ఆయన కామెంట్ చేస్తున్నారు. ఆయితే ఏపీ కాంగ్రెస్ నేతలు మాత్రం చిరంజీవి మావాడే అంటూ అనేక సార్లు ప్రస్తావిస్తున్నారు. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని, ఆయన కాంగ్రెస్ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు అంటూ ఏపీకి చెందిన కాంగ్రెస్ రకరకాల ప్రకటనలు చేస్తున్నారు. కొత్తగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన గిడుగు రుద్రరాజు సైతం ఇప్పుడు చిరంజీవి అంశాన్ని ప్రస్తావించడం హాట్ టాపిక్ అవుతోంది. చిరంజీవి కాంగ్రెస్ లోనే ఉన్నారని గిడుగు రుద్రరాజు వ్యాఖ్యానించడంతో మళ్లీ చిరు వ్యవహారం రాజకీయ వర్గాల్లో హాట్ టపాయికే అయింది.
ఇక గతంలో కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ గా ఉన్న ఉమెన్ చాంది చిరంజీవి తమ పార్టీలో లేడు అంటూ వ్యాఖ్యలు చేసినా ఏపీ కాంగ్రెస్ నేతలు మాత్రం చిరంజీవి మా పార్టీలోనే ఉన్నాడని, సినిమా వ్యవహారాలలో బిజీగా ఉండడంతోనే కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొనడం లేదని చెబుతూ కవర్ చేస్తూ వస్తున్నారు. అయితే చిరంజీవి కూడా ఈ విషయంలో దాట వేసే ధోరణితో వ్యవహరిస్తున్నారు కానీ తాను కాంగ్రెస్ నుంచి తప్పుకున్నానని చెప్పడం లేదు. రాజకీయాలకు దూరమయ్యా అని చెప్పుకుంటూనే ఉన్నా తాను కాంగ్రెస్ నుంచి తప్పుకున్నానని చెప్పక పోవడంతో ఇప్పుడు ఈ అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అధికారికంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకుండా.. రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని చిరంజీవి చెబుతూ రావడంతో అసలు ఆయన ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు దీని మీద ఆయన ఒక క్లారిటీ ఇస్తే బాగుండు అని విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.