Nitin Gadkari : దేశ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కీలకం..నితిన్ గడ్కరీ
Nitin Gadkari : భారతదేశంలో ముఖ్యమైన రాష్ట్రాల్లో.. ఆంధ్రప్రదేశ్ ఒక సంథింగ్ స్పెషల్ అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. ఏపీ అభివృద్దికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని మంత్రి నితిన్ గడ్కరీ భరోసా ఇచ్చారు. విశాఖ వేదికగా జరిగిన ప్రపంచ పెట్టుబడుల సదస్సులో గడ్కరీ ప్రసంగిస్తు.. దేశంలో ముఖ్యమైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక స్థానం ఉందని కితాబిచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో ఏపీలో రోడ్ కనెక్టివిటీ పెంచేందుకు రూ.20 వేల కోట్లు కేటాయించామని తెలిపారు. ఏపీలో మూడు పారిశ్రామిక కారిడార్లు రాబోతున్నాయని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయిస్తే.. తిరుపతిలో ఇంట్రా మోడల్ బస్ పోర్ట్ , అలాగే మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. పోర్టులతో రహదారులను అనుసంధానం చేస్తాం. ఏపీ జాతీయ రహదారులను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. దేశ అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ కీలకమని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రత్యేక దృష్టి పెట్టామని అందులో భాగంగానే ఈ తొమ్మిదేళ్లలో 4200 కిలోమీటర్లు ఉన్న జాతీయ రహదారులను 8700 కిలోమీటర్లకు పెంచామని చెప్పారు. హైదరాబాద్-బెంగళూరు వరకు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేస్తున్నామని తెలిపారు.