NaraLokesh: మీ అందరి కోసం వస్తున్నా ఆశీర్వదించండి.. నారా లోకేష్
NaraLokesh: వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ‘యువగళం’ పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు సిద్దమయ్యారనే విషయం తెలిసిందే. రేపటి నుంచి కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు.. ఈ నేపథ్యంలో నిన్న కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు లోకేష్. అమ్మానాన్ననారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, అత్తమామలు నందమూరి బాలకృష్ణ, వసుంధర నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు నారా లోకేష్.పాదయాత్ర కు ముందు లోకేష్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు.
టీడీపీకి మరోసారి అధికారం ఇచ్చి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు. ‘మీ అందరి కోసం వస్తున్న నన్ను ఆశీర్వదించండి’. ఆదరించండని నారా లోకేష్ ప్రజలను కోరారు. జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం సాగిస్తున్న విధ్వంసం మీరంతా చూస్తూనే ఉన్నారు. ప్రతివర్గం మాకొద్దీ అరాచకపాలన అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాల కల్పనలో ఈ ప్రభుత్వం విఫలమైందన్నారు. సైకో పాలనా పోవాలి సైకిల్ పాలనా రావాలన్నారు. రాష్టానికి ఎలాగో కొత్త పరిశ్రమలు రావడం లేదు. ఉన్నవీ తరిమేస్తున్నారు. కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో విద్వేషాలు ఎగదోసి వికృత రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారుఅభివృద్ధికి వారధిగా నిలుస్తాను. రైతన్నని రాజుగా చూసేవరకూ విశ్రమించను. ఆడబిడ్డలకు రక్షణ అవుతాను. మీరే ఒక దళమై బలమై నా యువగళం పాదయాత్రని నడిపించాలని లేఖలో పేర్కొన్నారు. ఇక కుప్పం నుంచి తన ‘యువగళం’ పాదయాత్రను ప్రారంభించనున్నారు.
ఇక లోకేష్ పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతిని ఇచ్చారు పోలీసులు. కాగా నేడు సాయంత్రానికి తిరుపతి నుండి కుప్పానికి నారా లోకేష్ చేరుకోనున్నారు. రేపు ఉదయం కుప్పంలో వరదరాజస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి కమతమూరు క్రాస్ వద్ద భారీ ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో నారా లోకేష్ ప్రసంగించానుకున్నారు. ఇక కుప్పంలో మొదలు కానున్న పాదయాత్రలో నందమూరి బాలకృష్ణ పాల్గొననున్నారు.