Nara Lokesh: ప్రణాళిక సంఘం మాజీ అధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియాతో నారా లోకేష్ భేటీ
Nara Lokesh: టీడీపీ అనుబంధ విభాగం ‘తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్’ ప్రతిష్ఠాత్మక రీతిలో పబ్లిక్ పాలసీ – ఇంటర్న్షిప్ సదస్సు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆర్థికవేత్త ,ప్రణాళిక సంఘం మాజీ అధ్యక్షుడు మాంటెక్ సింగ్ ఆహ్లువాలియా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వర్చువల్ విధానంలో హాజరయ్యారు. తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ అధ్యక్షురాలు తేజస్వి పొడపాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా, కోర్ కమిటీ సభ్యులు కూడా పాల్గొని వివిధ రకాల ప్రశ్నలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సమావేశంలో 1991 ఆర్థిక సంస్కరణల ప్రభావం, వాటి వెనుక కృషి ని ఈ సమావేశంలో పంచుకున్నారు.అలాగే.. నారా లోకేశ్ వరల్డ్ బ్యాంకు ఉద్యోగ అనుభవం గూర్చి చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్టాల విద్యార్థులు వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. ఈ ముఖాముఖిలో పాల్గొని అభిప్రాయాలను పంచుకున్నందుకు సంతృప్తి వ్యక్తం చేశారు.