Nara Lokesh: ఎపిలో ఉద్యోగాలు నిల్.. నారా లోకేష్
Nara Lokesh: విశాఖలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చినవాళ్లు గిఫ్టులకోసం కొట్టుకున్నారని, కాగితాల్లేకుండా ఫేక్ ఎంఓయులు చేసుకున్నారని నారా లోకేష్ ఎద్దేవా చేశారు అది గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కాదు లోకల్ ఫేక్ సమ్మిట్ అని అన్నారు. అలాగే రాష్టంలో పోలీసుల సమస్యలను చూస్తే బాధగా ఉందని వచ్చేది తమ ప్రభుత్వమే ఉద్యోగులు, పోలీసుల సమస్యలను పరిష్కరిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. గతంలో జాబ్ క్యాపిటల్ అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఏపీ వచ్చేదని.. ఇప్పుడు గంజాయి క్యాపిటల్ అని సెర్చ్ చేస్తే ఏపీ వస్తుందని లోకేష్ విమర్శించారు. జాబ్స్ నిల్..గంజాయి ఫుల్ అని అన్నారు. తాము వచ్చాక గంజాయి స్మగ్లర్లను తరిమికొట్టే బాధ్యత తనది అని లోకేష్ అన్నారు.
ఇండోసోల్ అనే కడపకు చెందిన జగన్ బినామీ కంపెనీ రూ.76వేలకోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లు చెప్పారని, ఆ కంపెనీ పేరుతో 25వేల ఎకరాల భూములు కొట్టేయడానికి ప్లాన్ చేశారని ఆరోపించారు. 2.30లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని, 10వేల ఉద్యోగాలు ముష్టి వేశారని అన్నారు. రాష్ట్రానికి ఒక్క కంపెనీ రాలేదని, బెదిరింపులు, జే ట్యాక్స్ దెబ్బకు రాష్ట్రంలో ఉన్న కంపెనీలు ఇతర రాష్ట్రాలకు క్యూ కడుతున్నాయని విమర్శించారు. ఎపిలో అత్యధిక టాక్స్ పేయర్ అమరరాజా కంపెనీ ..వైసిపి తీరు వల్ల తెలంగాణకి పోయిందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు రాక 300 మంది నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వారి కుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. చిత్తూరు పాదయాత్రలో నేను పెట్టిన కంపెనీ దగ్గర సెల్ఫీ దిగి జగన్ కు ఛాలెంజ్ విసిరాను.. ఇప్పటి దాకా వైసిపి నుండి సమాదానం లేదు. రాదు కూడా అన్నాడు. ఏపీకి అత్యధిక పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన పరిశ్రమలు వెనక్కిపోయాయని లోకేష్ అన్నారు.