Andhrapradesh: బాలయ్య ఫ్లెక్సీలో వైసీపీ ఎమ్మెల్యే
Andhrapradesh: యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. శృతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. సంక్రాంతి కానుకగా ఈ గురువారం వీరసింహారెడ్డి ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ ఘన విజయం తర్వాత బాలకృష్ణ నటించిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తుంది.
ఇక బాలయ్య ఇందులో తండ్రీ కొడుకులుగా కనిపించిన తీరు ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబై పోతున్నారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఒకప్పటి ‘సమరసింహారెడ్డి’ ని గుర్తుకు తెస్తుంది. అభిమానులు తెలుగు రాష్టాల్లో సంబరాలు చేసుకుంటున్నారు.భారీగా బాలయ్య కటౌట్ లు పెట్టి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ, వైసీపీ ఎమ్మెల్యే ఉన్న భారీ ఫ్లెక్సీ ఒకటి కనిపించడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఎన్టీఆర్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ.. ఇప్పుడు పొలిటికల్ హైటెన్షన్ క్రియేట్ చేస్తోంది. చిత్రం విడుదల సందర్భంగా అభిమానులు శుభాకాంక్షలు చెబుతూ ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జిల్లా వెలగలేరు గ్రామంలోని అందులో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, హీరో బాలకృష్ణ ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీ కలకలం రేకిత్తిస్తోంది. ఇక ఈ విషయం కాస్తా చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించడంతో చర్చ మొదలైంది. ఈ ఫ్లెక్సీని చూసినవారు వైసీపీ ఎమ్మెల్యే పార్టీ మారడం ఖాయమంటున్నారు. అయితే ఈ ఫ్లెక్సీని వైసీపీ నాయకుడే ఏర్పాటు చేయడం గమనార్హం. వైసీపీ నేత చల్లగుళ్ల అజయ్ కుమార్ ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేసాడు నేను బాలయ్య అభిమానిని అలాగే ఎమ్మెల్యే వసంత కృష్ణ అభిమాని నికూడా అన్నారు. ఇక ఈ ఫ్లెక్సీ తో ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ నేతల గుండెల్లో గుబులు పట్టుకుంది.