Nagababu: ఆర్జీవి ఎంతకైనాదిగజారుతాడు..నాగబాబు
Nagababu Sensaiotnal comments on RGV, NTR and Chandrababu: శ్రీ కాకుళం రణస్థలంలో రేపు జరగనున్న యువశక్తి సభ ఏర్పాట్లను పరిశీలించిన జనసేన నేత నాగబాబు మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రేపటి యువశక్తి సభ ఎక్స్ లెంట్ గా ఉంటుందని, భయం లేకుండా యువత మాట్లాడే విధంగా ప్లాట్ఫారం ఏర్పాటు చేశామని అన్నారు. యువత ఆలోచనలు, కోరికలు, రాష్ట్ర అభివృద్ధి కి ఇచ్చే సూచనలు తీసుకుంటామని పేర్కొన్న ఆయన యువతను దిశా నిర్దేశం చేయడానికి మా అధినేత వద్ద కొన్ని ప్రణాళికలు ఉన్నాయని, వాటిని రేపు పవన్ ప్రకటిస్తారని అన్నారు.
ఇక రామ్ గోపాల్ వర్మ పెద్ద ఎదవ, సన్నాసి అంటూ ఫైర్ అయ్యారు. వాడు అవసరం కోసం ఎంతకైనా దిగజారుతాడని, ఒక కులం గురించి మాట్లాడటం తప్పని అన్నారు. కాపులకు ఆత్మాభిమానం లేదా ?, కాపులకు చాలా రెస్పెక్ట్ ఉందని ఆయన అన్నారు. ఎన్టీఆర్ ని, చంద్రబాబుని, సోకాల్డ్ అడ్డగాడిదలను గెలిపించింది కాపులే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అన్ని కులాలను గౌరవిస్తామని పేర్కొన్న నాగబాబు యువత ఆలోచనలు సోషల్ మీడియాకే పరిమితం అయ్యాయని, అందుకే జనసేన యువతకు అండగా ఉండబోతుందని అన్నారు.
ప్యాకేజీ మీ అమ్మ మొగుడిచ్చారా అని కొడాలి స్టైల్ లొ అడగవచ్చు కానీ అలా అననని ఆయన అన్నారు. ఒక సినిమాకి కోట్లాది రూపాయలు తీసుకునే మాకు ప్యాకేజీ అవసరమా? అని ప్రశ్నించారు. లక్షలాది, కోట్లాది రూపాయలు మావద్ద లేవని పేర్కొన్న ఆయన మాకున్న కొద్ది పాటి డబ్బుని , రిసోర్స్ ను అందరికీ పంచుతున్నామని అన్నారు. కానీ అది జీర్ణించుకోలేక ప్యాకేజీ అంటూ భావదారిద్య్రంతో మాటాడుతున్నాడని అన్నారు. మీ తాత, అయ్యా మాకు ప్యాకేజీ ఇచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. మేం అన్ని కులాలను గౌరవిస్తాం కానీ మాకు కుల పిచ్చి లేదని ఆయన పేర్కొన్నారు.