Nagababu: మంత్రి రోజాది నోరు కాదు.. మెగా బ్రదర్ సీరియస్
Nagababu: ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. మంత్రి రోజా మెగా హీరోలపై చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. సొంత జిల్లాలోనే గెలవలేదంటూ ఆమె సెటైర్లు పేల్చగా.. మెగా అభిమానులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, మెగా బ్రదర్ నాగబాబు రోజాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
నీది నోరు అనుకోవాలా లేక మున్సిపాలిటీ కుప్ప తొట్టా అనుకోవాలా అని మండిపడ్డారు. చూస్తూ చూస్తూ మునిసిపాలిటీ కుప్పతొట్టిలో ఎవ్వరూ వేలు పెట్టరని.. అందుకే నువ్వు మా అన్నయ్య చిరంజీవిని, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని ఎన్ని మాటలు అన్నా తాను స్పందించడం మానేశానని అన్నారు. ఈ మేరకు నాగబాబు మీడియాకు ట్విటర్ ద్వారా ఒక వీడియో స్టేట్మెంట్ విడుదల చేశారు.
ఏపీ పర్యాటకశాఖ మీద కొన్ని వేల మంది.. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. వారి జీవితాలు నాశనం అయ్యాయి. పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న నువ్వు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వాళ్ల పరిస్థితి మరింత దిగజారిపోతుంది. ముందు పర్యాటశాఖ మంత్రిగా నీ బాధ్యతలు సరిగా తెలుసుకో.. పర్యాటకశాఖ మంత్రి అంటే.. పర్యటనలు చేయడం కాదు పర్యాటకులు వచ్చేలా చేయి అన్నారు. భారతదేశ పర్యాటకశాఖ ర్యాంకింగ్స్‌లో ఉన్న 20 స్థానాల్లో మొదటి మూడు స్థానాల్లో కేరళ, అస్సాం, గుజరాత్‌లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలో ఉందని గుర్తు చేసారు.
రోజా @RojaSelvamaniRK
నీది నోరా లేక మున్సిపాలిటీ కుప్పతొట్టా ? pic.twitter.com/SFeIpZdBeL— Naga Babu Konidela (@NagaBabuOffl) January 6, 2023