Nagababu: పొత్తులపై నాగబాబు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు!
Nagababu on Alliance: జనసేన పీఏసీ సభ్యులు నాగబాబు రాయలసీమ జిల్లాలలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అనంతపురంలో పర్యటించిన ఆయన జనసేన కార్యకర్తలను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. సీమ జిల్లాల నుంచి ప్రజలు వలసలు పోకుండా ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని ఆయన అన్నారు. ఇక పొత్తుల విషయాన్ని పార్టీ అధినేత ప్రకటిస్తారని పేర్కొన్న ఆయన అన్ని విషయాలు సమయం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. అసలు ఏపీలో కాంగ్రెస్ ఎక్కడ ఉంది? అని ప్రశ్నించిన నాగబాబు కాంగ్రెస్ కాస్తా వ్తెసీపీగా మారిపోయింది కదా అని అన్నారు.
ఇక ఏపీ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని పేర్కొన్న ఆయన వాటిని అడ్డుకోవడానికి అందరూ ఏకం కావాలని అన్నారు. ఇక రోజా గురించి మాట్లాడటం అంటే మా స్థాయి తగ్గించుకోవడమేనని నాగబాబు అన్నారు. ఇక ఏపీలో ప్రభుత్వం కనుక మా ప్రచారాన్ని అడ్డుకున్నా, మా వాహనం ‘వారాహి’ని ఆపినా నడిచి ప్రజల్లోకి వెళ్లిపోతాం అంటూ కామెంట్ చేశారు. ఇక జనసేనగా తాము బీజేపీతో కలిసే ఉన్నామని ఈ సంధర్భంగా నాగబాబు పేర్కొన్నారు.
ఇక నిన్న కూడా నాగబాబు జనసేన పొత్తుల గురించి కామెంట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాను మాట్లాడిన మాటలను వక్రీకరించారు అంటూ నాగబాబు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రముఖ ఛానల్ ని ఉద్దేశిస్తూ స్వీట్ చేశారు. వాస్తవానికి నాగబాబు మాట్లాడుతూ పొత్తుల గురించి ఆలోచించడానికి చాలా సమయం ఉందని అన్నారు, అలాగే పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చనివ్వను అని అనడానికి కూడా వేరే కారణం ఏదైనా ఉండి ఉంటుందని నాగబాబు పేర్కొన్నారు. అవి వేరే రకంగా ప్రచురించడంతో ఆయన ఆ అంశం మీద సదరు ఛానల్ ను టార్గెట్ చేస్తూ ఫైర్ అవుతూ ట్వీట్ చేసిన వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది,