Naga babu: సీఎం జగన్ ఉన్నత విద్యావంతుడు కాడు, ఎవరు చెప్పినా వినడు
Naga babu comments on CM Jagan
జనసన నాయకుడు కొణిదెల నాగబాబు ఏపీ సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ ఉన్నత విద్యావంతుడు కాదని, ఎవరు చెప్పినా వినడని విమర్శించారు. ఇసుక , మద్యం అక్రమాలు , రియల్ ఎస్టేట్ మాఫియా ఏపీలో బాగా పెరిగిపోయిందని అన్నారు.
వారాహి యాత్రను అడ్డుకొనేందుకే జివో నెంబర్ 1 తెచ్చారని నాగబాబు మండిపడ్డారు. ప్రజాస్వామ్యం నిలువనా పాతరవేయటానికే చట్టం తెరమీదకు తెచ్చారని నాగబాబు విమర్శించారు. శ్రీకాకుళంలోని తాళ్లవలపస వద్ద నిర్వహించిన యువశక్తి సభలో నాగబాబు పలు వ్యాఖ్యలు చేశారు.రాజకీయాల్లోకి యువత ఎక్కువుగా రావలసిన అవసరం ఉందని నాగబాబు అన్నారు.
యువశక్తి కార్యక్రమానికి ఉత్తరాంధ్రకు చెందిన అనేక మంది యువకులు హాజరయ్యారు. దేశంలో ఉవకులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై తమ గళం విప్పారు.ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు.