Nadendla Manohar: నాదెండ్లకు టీడీపీ ఆ ఆఫర్ ఇచ్చిందా?
Nadendla Manohar: రాజకీయాల్లో ఎప్పుడూ ఏమైనా జరగొచ్చు ఎందుకంటే అది రాజకీయం కాబట్టి. వినడానికి సినిమా డైలాగులానే ఉన్న ఇది నిజమే. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు నిన్నటి వరకు మరో పార్టీ నాయకుడిని దారుణంగా తిట్టిన నేతలే రేపు ఆయన చేతిలోనే కండువా వేయించుకుని ఆయనకు జై కొడుతున్నారు. అందుకే రాజకీయాల్లో ఏదైనా సంభవమే. ఇప్పుడు ఇదంతా ఎందుకనుకుంటున్నారా? జనసేన పార్టీలో నెంబర్ 2గా భావిస్తున్న నాదెండ్ల మనోహర్ కి తాజాగా టిడిపి ఒక ఆఫర్ ఇచ్చిందని చర్చ జరుగుతుంది. టిడిపిలోకి ఆయనని ఆహ్వానిస్తున్నట్లుగా ఆయన కూడా టిడిపిలో చేరాలని భావిస్తున్నట్లుగా ఒక ప్రచారం అయితే జరుగుతోంది.
ఈ వ్యవహారం కోసం ఇప్పటికే చర్చలు కూడా పూర్తయ్యాయని దీనికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి చేరిక రోజు కన్ఫర్మ్ చేస్తే ఇక అధికారికంగా ఆయన తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడం ఖాయమని అంటున్నారు. అయితే ఈ ప్రచారం నేపథ్యంలో విశ్లేషకులు రెండు ప్రశ్నలను సంధిస్తున్నారు. అదేమిటంటే నాదెండ్ల మనోహర్ జనసేనను ఎందుకు వదిలిపెట్టాలి? ప్రస్తుతానికి జనసేనలో ఆయనకు చాలా కీలకమైన పదవి ఉంది. పొలిటికల్ యాక్షన్ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తర్వాత అన్ని తానై వ్యవహరిస్తున్నారు. అలాగే రెండో ప్రశ్న ఆయన టిడిపిలోకి ఎందుకు వెళ్లాలి? ఎందుకంటే జనసేన, టీడీపీ ఆల్రెడీ పొత్తులోకి వెళుతుంటే ఆయన కావాలనుకున్న సీటును అడిగి సాధించుకోవచ్చు.
అలాంటప్పుడు పవన్ పంచ నుంచి మళ్ళీ టిడిపి పంచన చేరాల్సిన అవసరం ఏముంది? వాస్తవానికి నాదెండ్ల మనోహర్ టిడిపిలో చాలామందికి నచ్చరు. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన నాదెండ్ల భాస్కరరావు కుమారుడే ఈ నాదెండ్ల మనోహర్ కావడంతో తెలుగుదేశం నాయకులు ఆయనను పెద్దగా ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదు. తెనాలి నియోజకవర్గంలో టీడీపీ అనుకూల వర్గాల వారి ఇళ్లను నాదెండ్ల స్పీకర్గా ఉన్న సమయంలో కూలగొట్టించారని విమర్శలు కూడా ఉన్నాయి. కాబట్టి జనసేనలో పవన్ తోనే డైరెక్ట్ గా మాట్లాడుతున్న చంద్రబాబు నాదెండ్ల ఉన్నారన్న విషయం కూడా పట్టించుకోనట్లుగా చూసి చూడనట్లు వదిలేస్తున్నారు.
ఎందుకంటే ఒకవేళ నాదెండ్లను పార్టీలోకి పిలిచారు అంటే అప్పుడు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కుమారుడిని పిలవడం అంటే పార్టీ నేతల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది. ఇలా ఎన్నికల సమయంలో చంద్రబాబు అలాంటి తప్పు చేస్తారా అంటే అది ఎవరు సమాధానం చెప్పలేని ప్రశ్న. అలాగే జనసేనలో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నేతగా ఒక వెలుగు వెలుగుతున్నారు. పవన్ కళ్యాణ్ తర్వాత కీలక నేత ఎవరు అంటే నాదెండ్ల మనోహర్ పేరే వినిపిస్తుంది. అలాంటి నేత ఒకవేళ టిడిపి ఆఫర్ ఇచ్చిన వెళతారా అంటే కష్టమే అలాగే టీడీపీ ఆఫర్ ఇస్తుందా అంటే అది కూడా కష్టం అనే చెప్పాలి. కాబట్టి ఇదంతా కావాలనే ఎవరో పుట్టించిన ప్రచారం అని రెండు పార్టీల శ్రేణులు కొట్టి పారేస్తున్నాయి. ఇందులో మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి.