Nadendla Manohar politics: నాదెండ్ల రాజకీయం… అంతా సౌమ్యం
Nadendla Manohar politics: ఏపీలో జనసేన పార్టీ రాజకీయం రసవత్తరంగా సాగుతున్నది. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతున్న వేళ జనసేన పార్టీ కీలకంగా వ్యవహరించే అవకాశం ఉన్నది. మార్చి 14వ తేదీన మచిలీపట్నంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరగనున్నది. ఈ సభలో పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. అయితే, పార్టీ ఆవిర్భవించినప్పటి నుండి పార్టీతో కలిసి ఉన్న నేత నాదేండ్ల మనోహర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత ఆయన తెలుగుదేశం లేదా వైసీపీలో చేరే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కానీ, ఆయన రెండు పార్టీలను పక్కన పెట్టి పవన్ కళ్యాణ్‌తో చేతులు కలిపారు.
గత ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ ఆయనతోనే కలిసి పయనిస్తున్నారు. మొదటి నుండి నాదెండ్ల మనోహర్ సౌమ్యుడిగా పేరున్నది. అందరిలా రఫ్ అండ్ టఫ్ రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటాడు. ఒక విధంగా ఇదే ఆయన ఎదుగుదలకు అడ్డంకిగా మారింది. పార్టీలో నాదెండ్ల మనోహర్ నెంబర్ 2గా ఉన్నారు. నాదెండ్ల మనోహర్ చెప్పినట్లుగానే పవన్ కళ్యాణ్ వింటారని, పార్టీ దూకుడుగా వ్యవహరించాల్సిన సమయంలో మెల్లిగా పయనించడానికి నాదెండ్ల మనోహర్ కూడా ఒక కారణమని, పార్టీలోకి నేతలు చేరకపోవడానికి, ఉన్న నేతలు బయలకు వెళ్లిపోవడానికి కూడా ఆయనే కారణమని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వస్తున్నాయి. మరి ఈ కామెంట్లకు రేపు మచిలీపట్నంలో జరిగే ఆవిర్భావ సభలో చెక్ పెడతారా చూడాలి.