Nadendla Manohar: గ్లోబల్ సమ్మిట్ బూటకం, అంకెల గారడీ మోసం
Nadendla Manohar: రాజమండ్రిలో శనివారం రాత్రి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అసెంబ్లీ నియోజక వర్గాల జనసేన పార్టీ ఇంఛార్జులు, నగర అధ్యక్షులతో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశం నిర్వహించారు. ఆ తరువాత రాజమండ్రిలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గ్లోబల్ సమ్మిట్ బూటకం, అంకెల గారడీతో ప్రజలను వైసిపి ప్రభుత్వం మోసమని అన్నారు. సీ ఫుడ్స్ ఎగుమతుల్లో భారతదేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉందని తప్పుడు ప్రచారం అని అన్నారు. కోడిగుడ్డును సీఫుడ్స్ లో కలిపి చూపడంతో మంత్రులు ఎంత అవివేకంతో ఉన్నారో చెప్పడానికి ఉదాహరణ అని పేర్కొన్న ఆయన ఇన్వెస్టర్లను తప్పు పట్టడం లేదు కానీ వైసీపీ తప్పుడు ప్రచారం చేయడాన్నే ఖండిస్తున్నామని అన్నారు. గ్లోబల్ సమ్మిట్ పేరుతో 170 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని చిత్తశుద్ధితో చేస్తే మెరుగైన పెట్టుబడులు వస్తాయని అలా చేస్తే జనసేన పార్టీ సపోర్టు చేస్తుందని అన్నారు. ఇక ఈ సమ్మిట్ మీద ఎలాటి రాజకీయం చేయాలి అనుకోవడం లేదని పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.