MP Raghu Rama Krishnam Raju : నాకు భద్రత కావాలి… కేంద్ర హోంశాఖకు విజ్ఞప్తి
తనకు భద్రత కావాలంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కేంద్ర హోంశాఖను కోరారు. తన నియోజకవర్గమైన నరసాపురానికి నాల్గోవ తేదీన ప్రధానమంత్రి వస్తున్నారని, ఈ నేపథ్యంలో తాను కూడా అక్కడికి వెళ్లాల్సి ఉంటుందని హోంశాఖ సహాయ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జూలై 4న నర్సాపురం లోక్ సభ నియోజకవర్గ పరిధిలో భీమవరంలో ప్రధానమంత్రి సభ జరగనుంది. ఈ సభకు వెళ్ళడానికి తనకు కావలసిన భద్రతను కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని రఘురామ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ తో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శిని సైతం కలిశారు. వైసీపీ నేతల హెచ్చరికల నేపథ్యంలో రఘురామ కృష్ణంరాజు పర్యటన ఆసక్తికరంగా మారింది. సొంత నియోజకవర్గంలో పర్యటించడానికి ఆయన ఇలా భద్రతను కోరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.