MP Mithun Reddy: ఎంపీ మిథున్ రెడ్డికి త్రుటిలో తప్పిన పెనుప్రమాదం!
MP Mithun Reddy Car Accident: పండుగ పూట ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు ఎంపీ మిధున్ రెడ్డి లకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. అసలు విషయం ఏమిటంటే అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం చిన్న ముక్క పల్లె రింగ్ రోడ్డు వద్ద మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ మిధున్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనానికి పెను ప్రమాదం తప్పింది. పండుగ నాడు వీరు నూతన బంధువులు ఇంటికి వెళుతూ ఉండగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్ లో ఉన్న ఎంపీ మీదన్ రెడ్డికి చెందిన వాహనాన్ని ఎదురుగా వచ్చిన మరో కారు ఢీ కొట్టింది. ఈ నేపద్యంలో ఎంపీ వాహనం పల్టీలు కొట్టింది. మిథున్ రెడ్డి వాహనంలో ప్రయాణిస్తున్న మిథున్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి అలాగే ఇతర భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. దీంతో వెంటనే రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి కుటుంబ సభ్యులందరూ సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు వారి స్వస్థలమైన పుంగనూరు నుంచి వీరబల్లిలోని ఎంపీ మిధున్ రెడ్డి అత్తగారింటికి వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాహనంలోనే ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఉండడంతో పెను ప్రమాదం తప్పినట్లు అయింది. ఎంపీ వాహనం ప్రమాదానికి గురి కావడంతో ఆయనకేమైనా అయిందేమో అని అందరూ ముందు భయపడ్డారు కానీ తర్వాత ఆయన మంత్రి వాహనంలో ఉన్నారని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు.