Avinash Reddy: విచారణకు హాజరుకాలేను.. సీబీఐకు అవినాష్ రెడ్డి లేఖ
Avinash Reddy: రేపు హైదరాబాద్ లో సీబీఐ విచారణకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి హాజరు కావడం లేదని తెలుస్తోంది. ఈ మేరకు సీబీఐ అధికారులకు ఎంపీ అవినాష్ సమాచారం ఇచ్చారని అంటున్నారు. ముందు ఫిక్స్ చేసుకున్న షెడ్యూల్ కారణంగా రాలేను అని సీబీఐకి చెప్పారని అయితే సీబీఐ నుంచి ఎలాంటి స్పందన లేదని అంటున్నారు. రేపు పులివెందుల ప్రాంతంలో పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని తెలుస్తోంది. రేపు వేంపల్లి మండలంలో ఎంపీ పర్యటన సందర్భంగా సీబీఐ విచారణకు డుమ్మా కొడుతున్నట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో రేపు సీబీఐ విచారణకు హాజరు కావాలని కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది.
ఈ నోటీసుపై స్పందించిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి, వ్యక్తిగత కారణాలవల్ల రేపు సీబీఐ విచారణకు హాజరు కాలేనని లేఖ రాశానని అంటున్నారు. ఇక విచారణకు హాజరు కావాల్సిందే అని సీబీఐ అధికారులు చెబుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఇప్పటికే హైదరాబాద్ నుంచి కడప బయలుదేరి వెళ్లారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. ఈ క్రమంలో రేపు ఏం జరుగుతుందో దానిపై ఉత్కంఠ నెలకొంది. రేపు, ఎల్లుండి తప్ప మిగతా ఎప్పుడైనా విచారణకు హాజరవుతానని కడప ఎంపీ అవినాష్ రెడ్డి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.