Avinash Reddy: సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా మర్డర్ కేసులో (YS Viveka murder case) కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి (MP Avinash Reddy) తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి మరోసారి అవినాశ్ రెడ్డి సీబీఐ (central bureau of investigation) విచారణకు హాజరుకానున్నారు.
Avinash Reddy: సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా మర్డర్ కేసులో (YS Viveka murder case) కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి (MP Avinash Reddy) తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి మరోసారి అవినాశ్ రెడ్డి సీబీఐ (central bureau of investigation) విచారణకు హాజరుకానున్నారు. మరికాసేపట్లో హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి (CBI Office) వెళ్లనున్నారు. ఇప్పటికే పలుమార్లు అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. ఇక ఈరోజు ఏయో అంశాలపై అవినాశ్ రెడ్డిని ప్రశ్నించనున్నారనేది ఉత్కంఠకరంగా మారింది.
ఇకపోతే ఈ కేసుకు సంబంధించి తనపై తీవ్ర ఆరోపణలు రావడంతో అవినాశ్ రెడ్డి ఈ ఏడాది ఏప్రిల్‌లో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. అయితే పలు కారణాల వల్ల ఆ పిటిషన్ విచారణ జాప్యం అయింది. చివరికి సుప్రీంకోర్టు జోక్యంతో విచారణ చేపట్టిన హైకోర్టు అవినాశ్ రెడ్డికి ఊరట కల్పించింది. షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూర్ చేస్తూ తుది తీర్పు వెల్లడించింది. రూ. 5లక్షల పూచీకత్తు, రెండు షూరిటీల మీద బెయిల్ మంజూర్ చేసింది. అలాగే జూన్ 19 వరకు ప్రతి శనివారం.. ఉదయం 10 నుంచి సాయంత్రం 4.15 గంటల సమయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలతో అవినాశ్ రెడ్డి గత శనివారం సీబీఐ విచారణకు హాజరయ్యారు. అలాగే ఈరోజు కూడా విచారణకు హాజరు కానున్నారు.
మరోవైపు అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని వైఎస్ వివేకా కూతురు.. వైఎస్ సునీత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ముందస్తు బెయిల్ రద్దు చేయాలని పిటీషన్ దాఖలు చేశారు. అవినాశ్‌పై మోపిన అభియోగాలన్నీ అత్యంత కీలకమైనవని..సీబీఐ మోపిన అభియోగాలను హైకోర్టు సరిగ్గా పరిగణనలోకి తీసుకోలేదని పిటీషన్లో పేర్కొన్నారు. హైకోర్టు తీర్పులో లోపాలు ఉన్నాయని… అవినాశ్ బెయిల్‌ను సీబీఐ కూడా వ్యతిరేకిస్తోందని వెల్లడించారు. ఈ మేరకు అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోర్టును కోరారు. ఈ మేరకు వాదనలు విన్న న్యాయస్థానం విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.