YS Avinash Reddy: న్యాయవాదితో కలిసి సీబీఐ కార్యాలయానికి వెళ్లిన అవినాష్‌రెడ్డి
YS Avinash Reddy: వైఎస్ వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి పాత్రపై విచారించనున్నారు. ఇప్పటికే మూడుసార్లు అవినాష్‌రెడ్డిని విచారించిన సీబీఐ తాజాగా నేడు మరోసారి విచారించనున్నారు. ఇప్పటికే తన విచారణపై స్టే ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించాడు అవినాష్‌రెడ్డి. హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌లోఉంచింది హైకోర్టు. సీబీఐ విచారణలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
దీంతో ఈరోజు సీబీఐ ముందుకు అవినాష్‌రెడ్డి తన న్యాయవాదితో విచారణకు హాజరయ్యారు. హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి పాత్రపై అనుమానముందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. విచారణ సమయంలో అవినాష్‌రెడ్డి వీడియో, ఆడియో రికార్డు చేయనున్నారు అధికారులు. నేడు ఉ.11 గం.లకు సీబీఐ కార్యాలయానికి ఎంపీ అవినాష్‌రెడ్డి ఆయన న్యాయవాది కలిసివెళ్లారు. నేడు నాలుగోసారి సీబీఐ విచారణ చేయనున్న నేపథ్యంలో ఎలాంటి ప్రశ్నలు వేయనున్నారనే ఉత్కంఠ నెలకొంది. అలాగే ఈ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ని కూడా విచారిస్తున్నారు సీబీఐ అధికారులు. ఈనెల 12 న భాస్కర్ రెడ్డి సీబీఐ విచారణ కోసం కడప జైలుకు వెళ్లారు. అయితే, విచారణ అధికారులు లేకపోవడంతో వెనుతిరిగి వెళ్లిపోయారు. కాగా ఇప్పటికే ఈ కేసులో పలువురిని అదుపులోకి తీసుకుంది.