Mlc Varudu Kalyani: వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా.. ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
Mlc Varudu Kalyani: ఆంధ్రప్రదేశ్ వైసీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటన జారీ చేసింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం ప్రకటించినట్టు పేర్కొంది. అటు వైస్సార్సీపీ పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం ప్రెసిడెంట్ గా ధనుంజయ్ రెడ్డి, బసిరెడ్డి సిద్ధార్ధ రెడ్డి నియామకం అయ్యారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే మరో 30 సంవత్సరాలు వైస్సార్సీపీ కి తిరుగుండదని అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లాలని నేతలకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి అందరికీ వివరించి ఆశీర్వాదం తీసుకోవాలని నేతలకు సూచించారు.
వరుదు కల్యాణి ఇప్పటికే ఎన్నో పదవులు నిర్వహించారు. పార్టీలో ఆమె కంటూ ఓ ప్రత్యేకత ఉంది. పార్టీ అప్పగించిన ఏ బాధ్యత అయినా ఆమె అలుపెరగకుండా నిర్వహిస్తూ వస్తున్నారు. ఆమె పని తీరుతో సంతృప్తి చెందిన వైసీపీ నాయకత్వం ఎమ్మెల్సీ కల్యాణికి ఈ కీలక అప్పగించింది పార్టీ నేతలు తెలిపారు.