MLC Elections: నేడు ఎమ్మెల్సీ ఎన్నికల సమయం…
MLC Elections: నేడు ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటింగ్ జరగనున్నది. రెండు ఉపాధ్యాయ, మూడు పట్టభద్ర, నాలుగు స్థానిక సంస్థల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించేందుకు సర్వశక్తులు ఒడ్డాయి. ఎలాగైనా అధికార టీడీపీని ఓడించాలని కంకణం కట్టుకున్న ప్రతిపక్షాలు పావులు కదిపాయి. తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ఎత్తులు వేసింది. లెఫ్ట్ పార్టీలతో పొత్తులు పెట్టుకున్నది. పట్టభద్రుల స్థానాలకు పోటీ చేస్తున్న టీడీపీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే సరికి లెఫ్ట్ పార్టీలకు అవకాశం ఇచ్చింది. ఆ పార్టీలు అండగా ఉన్న ఉపాధ్యాయ సంఘాలకు మద్దతు పలికింది. అయితే, అన్ని స్థానాల్లో తామే విజయం సాధిస్తామని అధికార వైసీపీ స్పష్టం చేసింది.
ఈరోజు ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈరోజు ఎన్నికలు జరుగుతుండగా, ఈనెల 16వ తేదీన ఓట్లను లెక్కించనున్నారు. వచ్చే ఏడాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలను సెమీస్‌తో పోలుస్తున్నారు. కాగా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం కావడంతో పట్టభద్రులు, ఉపాధ్యాయుల కేటగిరిలో మాత్రమే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటింగ్ జరుగుతున్నది.