Shock to YSRCP: వ్యతిరేకత ఉందనుకున్నాం కానీ మరీ ఇంతలానా?
Shock to YSRCP: ఉత్తరాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేల అత్యవసర భేటీ అయ్యారని అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై నేతల మధ్య హాట్ హాట్ చర్చ జరిగిందని, వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందనుకున్నాం కానీ ఈ స్థాయిలో ఉందని అంచనా వేయలేకపోయామంటున్నారని తెలుస్తోంది. తమ అస్త్రాలు ప్రభుత్వ వ్యతిరేకత ముందు విఫలమయ్యాయని నేతలు అభిప్రాయపడ్డారని, ఈ ఫలితాలు తమకు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయంటూ వైసీపీ నేతలు కామెంట్ చేశారని అంటూ టీడీపీ అనుకూల మీడియాలో వార్తలు వస్తున్నాయి. కడప జిల్లాలో కూడా వైసీపీకి అనుకూల ఓటింగ్ జరగలేదని, అయితే తమ పదవులకు ముప్పు అనే ప్రచారాన్ని మంత్రులు తప్పుపట్టినట్టు చెబుతున్నారు. 9 జిల్లాలు, 108 నియోజకవర్గాల్లో వచ్చిన ఫలితాలతో ప్రజల నాడి స్పష్టం అయింది అని ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు కామెంట్ చేసినట్టు చెబుతున్నారు.
అయితే ఇదంతా వారి మనోగతం అని అంటున్నా తెలియకుండానే లేదు కానీ వైసీపీ మీద ఒక రేంజిలో జనాల్లో వ్యతిరేకత అయితే ఉంది. సర్వేలు పలు రకాలుగా దాన్ని ఎక్కడో ఒకచోట ప్రతీరోజూ బయట పెడుతూనే ఉన్నా ఇప్పటివరకు అవన్నీ విపక్షాలు సొంత సర్వేలు అని అధికార పక్షం కొట్టిపారేస్తూ వచ్చింది. అయితే ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు చూస్తే కచ్చితంగా అధికార వైసీపీకి దిమ్మతిరిగే షాక్ తగిలిందని చెప్పక తప్పదు. వైసీపీ నాలుగేళ్ల పాలన పూర్తయిన క్రమంలో ఎపుడూ పోలింగ్ కోసం ఓటింగ్ కి రాని పట్టభద్రులు ఎర్రటి ఎండలో గంటల తరబడి నిలబడి ఓటేసి పగ తీర్చుకున్నారు. చదువుకుని వివిధ ఉద్యోగాలు చేస్తున్న వారు, పదవీ విరమణ చేసినవారు డిగ్రీలు అందుకుని ఇంటికే పరిమితం అయిన మహిళలు, మేధావులు తమ సత్తా ఏంటో చూపించారు.
ఈ కారణంగానే వైసీపీకి భంగపాటు ఎదురయిందని, ఏపీలో మూడు పట్టభద్రుల ఎన్నికలు జరిగితే అందులో రెండింట అద్భుతమైన మెజారిటీతో టీడీపీ దూసుకుపోతోంది అంటే దానికి కచ్చితంగా వైసీపీ చేసుకున్న స్వయంకృతాపరాధం అనే అంటున్నారు విశ్లేషకులు. ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం కాదు ఇచ్చిన వాటిని ఎంతవరకూ నిలబెట్టుకున్నారు అన్న దాన్ని యువత లెక్కలు వేసుకుని ఓటేశారని అంటున్నారు. ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ ని ఏటా జనవరిలో రిలీజ్ చేస్తామని చెప్పిన వైసీపీ ఆ హామీని విస్మరించిందని, లక్షా పాతిక వేల పోస్టులు సచివాలయంలో ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నా వారైనా సంతృప్తిగా లేరని ఈ ఫలితాలు చెబుతున్నాయి.
జీతాలు తక్కువ పని భారాలు ఎక్కువగా ఉండడంతో వారు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత పెంచుకున్నారని అర్ధం అవుతోందని అంటున్నారు. ఏపీలో పెట్టుబడులు లేవు ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయి, అభివృద్ధి లేదు, సంక్షేమం తప్ప తమ భవిష్యత్తు ఏంటో అర్థం కాదు అవడంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇలా వాతలు పెట్టారని అంటున్నారు. అందుకే వైసీపీని రెండు చోట్ల దారుణంగా వెనక్కి నెట్టారని, పశ్చిమ రాయలసీమలో కూడా చివరి రౌండ్లలో టీడీపీకె అధికారం దక్కే అవకాశం ఉందని అంటున్నారు. సార్వత్రిక ఎన్నికకు ఏడాది ముందు ఇలాంటి చేదు ఫలితాలు రావడంతో వైసీపీ పెద్దలు వైనాట్ 175 అని కాకుండా కనీసం అధికారం కోసం నిలబడే ప్రయత్నం చేసినా చాలని అంటున్నారు.