Kotamreddy Sridhar Reddy: ఏపీ అసెంబ్లీలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసన
Kotamreddy Sridhar Reddy: ఏపీ అసెంబ్లీలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నేడు నిరసనకు దిగారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందు అసెంబ్లీ బయట సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద కోటంరెడ్డి నిరసన తెలిపారు. తరువాత అసెంబ్లీ లో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని శ్రీధర్ రెడ్డి కోరారు. ఈ విషయమై స్పీకర్ తమ్మినేని సీతారాం జోక్యం చేసుకున్నారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కల్గించవద్దని కోరారు. ఈ విషయాలపై ప్రభుత్వం స్పందించనుందని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు.
స్పీకర్ ప్రశ్నోత్తరాలను ప్రస్తావించిన వెంటనే నియోజక సమస్యలను ప్రస్తావిస్తూ కోటంరెడ్డి ప్లకార్డుతో సభలో నిలబడ్డారు. దీంతో క్వశ్చన్ అవర్‌లో మెంబర్ మధ్యలో మాట్లాడకూడదని స్పీకర్ తెలిపారు. శ్రీధర్ రెడ్డి కావాలనే రగడ చేయాలనుకుంటున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు. ఆయన హౌస్‌ను ఇబ్బందిపెట్టి ప్రజల దృష్టిలో పడాలని చూస్తున్నారన్నారు. ఇదంతా టీడీపీ వాళ్లే చేపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. అసెంబ్లీలో రగడ సృష్టించేందుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.