RK Roja: లోకేష్ ది యువగళం కాదు తెలుగు దేశం పార్టీ మంగళం పాడే కాలం!
Roja Slams Lokesh: తిరుపతిలో మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ టీడీపీ, జనసేన మీద విరుచుకుపడ్డారు. కుప్పంలో చంద్రబాబు దొంగ ఓట్లతో ఎమ్మెల్యే గా గెలిచాడని, కర్ణాటక ..తమిళనాడు దొంగ ఓట్లతో ఇన్నాళ్ళూ గెలిచాడని ఆమె ఆరోపించారు. ఇప్పుడు అ ఓట్లు పోవడంతో మున్సిపల్ ఎన్నికల కుప్పం ప్రజలు తరిమికొట్టారని అన్నారు. ఆ ఓట్లతోనే చిత్తూరు ఎంపీ సీటు కుడా గెలుస్తున్నాడని ఆమె ఆరోపించారు. ఇక నారా లోకేష్ ది యువగళం కాదు తెలుగు దేశం పార్టీ మంగళం పాడే కాలం అని విమర్శించిన ఆమె లోకేష్ వార్డు మెంబర్ కు ఎక్కువ, ఎమ్మెల్యేకు చాలా చాలా తక్కువని అన్నారు.
తండ్రి సీఎం, తాను మంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా ఓడిపోయాడు అంటే లోకేష్ కంటే వేస్ట్ లీడర్ ఎవరు లేడని పేర్కొన్న ఆమె లోకేష్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నాడో ఎవరికీ తెలియడం లేదని అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ ది యువ శక్తి కాదు ముసలి శక్తని పేర్కొన్న ఆమె గతంలో చిరంజీవి పార్టీ పెట్టి ఆ కులం వాళ్ళందరిని రోడ్డుమీద వదిలేశారని అన్నారు. మళ్ళీ ఇప్పుడు మరో పార్టీ పెట్టి మరోలా డ్రామా ఆడుతున్నారని, పవన్ కళ్యాణ్ వెనుక ఉండే వారు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. దత్తపుత్రుడు…ఉత్త పుత్రుడు 14 సంవత్సరాలు చంద్రబాబు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండని ప్రశ్నించిన ఆమె జాబ్ క్యాండర్ ప్రకటించి వేలాది,లక్షలాది ఉద్యోగుల ఇచ్చిన ఘనత జగన్ దని అన్నారు.