Minister Amarnath: రెండు నెలల్లో విశాఖ రాజధానిగా పరిపాలన..మంత్రి అమర్నాధ్
Minister Amarnath: ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు నెలల్లో వైజాగ్ రాజధానిగా పాలన కొనసాగుతుందని అన్నారు ఐటీ మంత్రి గుడివాడ అమర్ నాధ్. విశాఖలో జరుగుతున్న ఇన్ఫినిటి వైజాగ్ సదస్సు లో పాల్గొన్న మంత్రి గుడివాడ అమర్నాథ్ రాజధాని విశాఖ గురించి ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. విశాఖలో త్వరలో ఇన్ఫోసిస్ కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు. దేశంలోని ధనిక నగరాల్లో విశాఖ 9వ స్థానంలో ఉందని గుర్తుచేశారు. త్వరలో అదాని డేటా సెంటర్‌ను విశాఖలో ప్రారంభిస్తామని వెల్లడించారు. విశాఖను ఐటీ హబ్ చేయడమే తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు.
ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానులపై చర్చ రగడ కొనసాగుతూనే ఉంది. మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే రాజధాని ఏర్పాటుపై సమయం దొరికినప్పుడల్లా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏప్రిల్ నుంచి విశాఖ నుంచి సీఎం జగన్ పాలన చేస్తారని గతంలో చెప్పిన మంత్రి అమర్నాథ్, తాజాగా మార్చి నుంచే పాలన ప్రారంభం అంటూ చెప్పుకొచ్చారు. అయితే మూడు రాజధానులపై బిల్లు ఉపసంహరించుకున్న ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టే అవకాశం లేకపోలేదంటున్నారు విశ్లేషకులు. మరి అటు రైతులు అమరావతి అంటూ పాదయాత్రలు చేస్తుంటే ఇటేమో మంత్రులు విశాఖ రాజధాని అని తెరలేపారు. మరి మార్చినుండి విశాఖ రాజధానిగా ఉండనుందా? లేక మరోమారు రైతులు కోర్టును ఆశ్రయించనున్నారా అనేది వేచిచూడాలి.