ఏపీ ,తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్తూనే అలర్ట్ చేసింది. పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తులు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా శ్రీకాకుళం, మన్యం, అల్లూరి జిల్లాల్లో ఉధృతంగా పిడుగులు పడే అవకాశం ఉందని, పొలాల్లో పనికి వెళ్లే రైతులు, రైతు కూలీలు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండొద్దని హెచ్చరించింది.
Weather Report: ఏపీ,తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్తూనే అలర్ట్ చేసింది. పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తులు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా శ్రీకాకుళం, మన్యం, అల్లూరి జిల్లాల్లో ఉధృతంగా పిడుగులు పడే అవకాశం ఉందని, పొలాల్లో పనికి వెళ్లే రైతులు, రైతు కూలీలు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండొద్దని హెచ్చరించింది. దక్షిణ తమిళనాడు నుంచి మరఠ్వాడా, కర్ణాటక మీదుగా ద్రోణి విస్తరించి ఉంది. ఈ ద్రోణి ప్రభావంతో నేడు, రేపు అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, ఉభయగోదావరి, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని విపత్తలు నిర్వహణ సంస్థ తెలిపింది.
అలాగే ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు,ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కంచికచర్ల,నందిగామ, పెనుగంచిప్రోలు, గుంటూరు జిల్లా గుంటూరు, దుగ్గిరాల, మంగళగిరి, మేడికొండూరు, పెదకాకాని,తాడేపల్లి, తాడికొండ,తుళ్లూరుపల్నాడు జిల్లా అమరావతి,అచ్చంపేట, పెదకూరపాడు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన సముద్రంతోపాటు అండమాన్ నికోబార్ దీవుల్లోని మరికొన్ని ప్రాంతాలకు ముందుకు సాగడానికి అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. ఉత్తర-దక్షిణ ద్రోణి ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు, విదర్భ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉంది.
మరోవైపు రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. నేడు లేదా రేపు రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, జోగులాంబ గద్వాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మెదక్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయంటూ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.