Margadarshi: మార్గదర్శిని మూసి వేసే అవకాశం ఉందా? అధికారులు ఏం చెబుతున్నారు?
Margadarshi will be closed, if fraud is established
మార్గదర్శి యాజమాన్యం అక్రమాలు ఎస్టాబ్లిష్ అయితే కంపెనీని మూసివేస్తామపి ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఐజీ రామకృష్ణ తెలిపారు. ఏడు ప్రాంతాల అసిస్టెంట్ రిజిస్ట్రార్ల నుంచి సీఐడీకి ఫిర్యాదులు వచ్చాయని గుర్తుచేశారు.
విశాఖ, విజయవాడ, రాజమండ్రి గుంటూరులో ఫోర్మెన్ ఆఫ్ చిట్స్ ను విచారణ చేసామని తెలిపారు. 1982 చిట్ ఫండ్ యాక్ట్ 76, 79 సెక్షన్ల ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా వెళ్లారని అధికారులు గుర్తించారు. అన్ని బ్రాంచుల నుంచి డబ్బు మొత్తం వేరే చోటకు వెళ్ళిపోతుందని, చిట్టీదారుడికి తన డబ్బు ఎక్కడికి వెళ్తుందో తెలియదని అధికారులు తెలిపారు.
జవాబుదారీతనం లేదని తెలడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని అధికారులు వివరించారు.. కస్టమర్ల డబ్బును వేరే చోట ఇన్వెస్ట్ చేయడం చిట్స్ రూల్సుకు వ్యతిరేకమని అధికారులు స్పష్టం చేశారు. విశాఖ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు బ్రాంచుల ఫోర్మెన్లను కోర్టులో ప్రవేశపెట్టామని తెలిపారు. చిట్సులో ఎలాంటి నిబంధనలు ఉంటాయో ప్రజలకు తెలియదని గుర్తుచేశారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ల అనుమతితోనే చిట్ ప్రారంభించాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఐజీ రామకృష్ణ వివరించారు.
మార్గదర్శి రాష్ట్ర వ్యాప్తంగా 37 బ్రాంచీలు నిర్వహిస్తుందని..ఫోర్మెనుకు ఎలాంటి చెక్ పవర్ లేకపోవడం నిబంధనలకు విరుద్ధమని రామకృష్ణ తెలిపారు. ఏపీలో అడిగితే హైదరాబాదులో ఉందని చెబుతారు.. అక్కడికి వెళ్తే సమాధానం చెప్పడం లేదని రామకృష్ణ మండిపడ్డారు.
ప్రజల డబ్బుకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్గదర్శి నిధులు ఉషోదయ కంపెనీకి తరలిస్తున్నారని, అదే విధంగా ప్రజల సొమ్మును వారికి తెలియకుండా మూచ్యువల్ ఫండ్సుకు తరలించారని అధికారులు గుర్తించారు. సీఐడీ విచారణతో పాటు చిట్ ఫండ్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మార్గదర్శి యాజమాన్యం అక్రమాలు ఎస్టాబ్లిష్ అయితే కంపెనీని మూసివేస్తామని కూడా స్పష్టం చేశారు.