Manchu Manoj: కలిసొచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు.. మంచు మనోజ్ కామెంట్స్ వైరల్!
Manchu Manoj: సినీ నటుడు మంచు మనోజ్, దివంగత భూమా నాగిరెడ్డి కుమార్తె మౌనిక రెడ్డి మార్చి 3న వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. అయితే నిన్న భూమా స్వగ్రామం ఆళ్లగడ్డకు వెళ్లిన ఈ కొత్త జంట తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు దర్శించుకున్నారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహం అనే విషయం అని దాదాపు అందరికీ తెలుసు. మౌనికకు తొలి భర్త ద్వారా ఒక నాగభైరవ రెడ్డి అనే కొడుకు కూడా ఉన్నాడు. ఈ కుమారుడి గురించి ఇప్పుడు మంచు మనోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. శ్రీవారి దర్శనానంతరం మీడియాతో మంచు మనోజ్ మాట్లాడుతూ, కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వస్తాడంట అది ఇదేనేమో అంటూ కామెంట్ చేశారు. పెళ్లి అయిన తర్వాత మౌనిక వాళ్ల ఊరికి వెళ్లి, అక్కడి నుంచి తిరుమలకు వచ్చామని పేర్కొన్న మనోజ్ తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇక జీవితంలో ఏది ఓడి పోయినా ప్రేమ ఓడి పోకూడదని పేర్కొన్న ఆయన చివరికి తమ ప్రేమ గెలిచిందని అన్నారు. తన తల్లిదండ్రుల ఆశీస్సులు, తన అక్క సపోర్ట్, ఆశీస్సులు, పై నుంచి మౌనిక తల్లిదండ్రుల ఆశీస్సులు ఉన్నంత వరకు తమకు ఏమీ కాదని చెప్పారు.