Manchu Manoj: భూమా మౌనిక పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన మంచు మనోజ్
Manchu Manoj: మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి ఇటీవల పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వివాహం తరువాత ఆళ్లగడ్డ చేరుకున్న ఈ ఇద్దరు తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఇరు కుటుంబాల నుంచి వీరిద్దరూ ఆశీర్వాదాలు అందుకున్నారు. ఇదే సమయంలో రాజకీయంగానూ వీరి పాత్ర పైన చర్చ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో మౌనిక పోటీ చేయాలని ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీని పైన మంచు మనోజ్ తన స్పందన తెలిపారు.
భూమా మౌనికారెడ్డి రాజకీయాల్లోకి వస్తారనే టాక్ మొదలైంది. ఆళ్లగడ్డ రాజకీయాల్లో భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి తమ రాజకీయ చక్రం తిప్పారు. పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న మౌనిక రాజకీయ ఎంట్రీపై చర్చనడుస్తుంది. అయితే భర్త మంచు మనోజ్ మౌనిక పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చారు. తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత ఈ అంశంపై స్పందించారు మనోజ్. తన భార్య భూమా మౌనికరెడ్డి రాజకీయాల్లోకి రావాలనుకుంటే.. కచ్చితంగా తన మద్దతు ఉంటుందన్నారు. తనకు మాత్రం రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. కానీ ప్రజాసేవ చేయాలనీ ఉందని తాను ఏ నిర్ణయం తీసుకున్న నామద్దతు కచ్చితంగా ఉంటుందని తెలిపాడు.